ETV Bharat / sports

కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది: మ్యాక్స్​వెల్​

author img

By

Published : Feb 16, 2021, 7:54 AM IST

Glenn Maxwell open to playing for RCB
కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది: మ్యాక్స్​వెల్​

రానున్న ఐపీఎల్​లో కెప్టెన్​ విరాట్​ కోహ్లీతో ఆడాలని ఉందని అంటున్నాడు ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టు తనను వదులుకున్న కారణంగా ప్రస్తుత సీజన్​లో ఆర్సీబీలో చేరాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగుళూరు జట్టు తరఫున ఆడాలని ఉందని అంటున్నాడు ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​. 14వ సీజన్​ కోసం కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ వదులుకున్న తర్వాత విరాట్​ కోహ్లీ సారథ్యంలో ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టాడు.

"నేను విరాట్​ కోహ్లీతో వెంటనే కలిసిపోతాను. అతడి సారథ్యంలో పనిచేయడం చాలా బాగుంటుంది. కోహ్లీతో బ్యాటింగ్​ చేయడం కచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. నా ప్రయాణంలో అతడెప్పుడూ ఓ సహాయకారిగా ఉంటాడు. విరాట్​ చాలా తెలివైనవాడు. అతడితో కలిసి పనిచేయడానికే నా మొదటి ప్రాధాన్యం".

- గ్లెన్​ మ్యాక్స్​వెల్​, ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​

ఐపీఎల్​లో అత్యధిక పారితోషకం అందుకున్న విదేశీ ఆటగాళ్లలో గ్లెన్​ మ్యాక్స్​వెల్​ ఒకరు. టోర్నీలో ఇప్పటివరకు ముంబయి ఇండియన్స్​, దిల్లీ క్యాపిటల్స్​ (దిల్లీ డేర్​డెవిల్స్​), కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2018​లో రూ.9 కోట్లకు దిల్లీ జట్టు మ్యాక్స్​వెల్​ను సొంతం చేసుకున్నా.. ఆ సీజన్ తర్వాత అతడిని వదులుకుంది. గతేడాది జరిగిన ఐపీఎల్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టు రూ. 10.75 కోట్లు వెచ్చించగా.. అతడి ప్రదర్శనతో నిరాశ చెందిన టీమ్​ యాజమాన్యం ప్రస్తుత సీజన్​లో వదులుకుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ తరఫున ఆడాలని ఉందని మ్యాక్స్​వెల్​ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఫిబ్రవరి 18న ఐపీఎల్​ మినీ వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది.

ఇదీ చూడండి: చెపాక్​ పిచ్​పై మాజీల వాఖ్యలు.. గావస్కర్​ చురకలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.