ETV Bharat / sports

'ఆసీస్​కు అగ్రస్థానమా.. ఎలా సాధ్యం'

author img

By

Published : May 11, 2020, 4:11 PM IST

Former cricketer Gambhir has doubts over ICC Test rankings
'ఐసీసీ టెస్టు క్రికెట్​ ర్యాంకింగ్స్​పై అనుమానాలున్నాయి'

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన టెస్టు​ ర్యాంకింగ్స్​పై అనుమానాలున్నాయని మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ అన్నాడు. గత సీజన్​లో ఆసీస్​ చెప్పుకోదగ్గ విజయాలేవి సాధించకపోయినా ఆ జట్టు తొలి స్థానానికి ఎలా చేరిందని ప్రశ్నించాడు.

టెస్టు ర్యాంకింగ్స్​లో భారత జట్టు టాప్​ నుంచి మూడో స్థానానికి దిగజారడం పట్ల భారత మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానాన్ని ఆక్రమించగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్​, భారత్​లు ఉన్నాయి. ఫలితంగా 2016 నుంచి కాపాడుతున్న మొదటి ర్యాంకు భారత్ చేజారింది. తాజాగా దీనిపై స్పందించిన గంభీర్ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌పై అనుమానాలున్నాయన్నాడు.

టీమ్​ఇండియా కొంతకాలంగా అనేక విజయాలు సాధిస్తున్న క్రమంలో ఆసీస్​ జట్టు అగ్రస్థానానికి ఎలా చేరిందో తెలియడం లేదని అన్నాడు గంభీర్​. ఐసీసీ నిర్ణయించే పాయింట్ల విధానం సరిగా లేదని పేర్కొన్నాడు. టెస్టు ఛాంపియన్​షిప్​లో స్వదేశం, విదేశాల్లో గెలిచిన జట్టుకు ఒకే విధమైన పాయింట్లను ఇవ్వటం చెత్తగా ఉందని విమర్శించాడు. అలాంటి వాటన్నింటిని పరిగణిస్తే భారత్​ అగ్రస్థానంలో ఉండాలన్నాడు. ఆసీస్​ తొలి స్థానానికి చేరడంపై అనుమానాలున్నాయని తెలిపాడు.

మే నెల తొలి వారంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆస్ట్రేలియా (116 పాయింట్లు) టాప్‌ ర్యాంకుకు చేరగా... న్యూజిలాండ్‌ (115) రెండో స్థానానికి ఎగబాకింది. భారత్‌ (114) మూడో ర్యాంకుకు పడిపోయింది. అయితే 2003లో టెస్టు ర్యాంకుల్ని ప్రవేశపెట్టాక మొదటి మూడు ర్యాంకుల జట్ల మధ్య మరీ ఇంత అత్యల్ప వ్యత్యాసం ఉండటం ఇదే మొదటిసారి.

ఇదీ చూడండి.. అవకాశం ఇస్తే మళ్లీ ఆడతా: ఇర్ఫాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.