ETV Bharat / sports

మోదీజీ.. ఇదే నా ఫిట్​నెస్​ రహస్యం​ : కోహ్లీ

author img

By

Published : Sep 24, 2020, 4:48 PM IST

Kohli
కోహ్లీ

ఫిట్​ ఇండియా ఉద్యమంలో భాగంగా ప్రధాని మోదీకి తన ఫిట్​నెస్​ సీక్రెట్​ను చెప్పాడు భారత సారథి కోహ్లీ. క్రికెటర్లందరికీ చేసే యోయో టెస్టుకు కూడా హాజరవుతాడని తెలిపాడు.

ఫిట్​ ఇండియా ఉద్యమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి తన ఫిట్​నెస్​ రహస్యాన్ని వెల్లడించాడు టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ. ప్రతిరోజు డైట్​ పాటిస్తూ, కసరత్తులు చేయడమే తాను ఫిట్​గా ఉండటానికి కారణమని చెప్పాడు. మనసులో గట్టి సంకల్పం ఉంటే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని తెలిపాడు.

కోహ్లీ

"ప్రతిఒక్కరు శారీరకంగా అలిసిపోతారు. కానీ ప్రతిరోజూ సరైనా డైట్​ పాటిస్తూ వర్కౌట్​ చేస్తే దాన్ని అధిగమించొచ్చు. నేను క్రమం తప్పకుండా శరీరానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటిస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందిలో ఇది కొరవడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం మధ్య సమతుల్యం పాటించడం అవసరం. కాబట్టి అందరూ దీనిని అనుసరించాలని నా సూచన"

-కోహ్లీ, టీమ్​ఇండియా సారథి

"జట్టుకు కెప్టెన్ అయిన మీరు, యో-యో టెస్ట్​ చేయించుకుంటారా" అని మోదీ కోహ్లీని అడిగారు.

"ఫిట్​నెస్ దృష్టితో చూస్తే యో-యో పరీక్ష చాలా ముఖ్యం. ప్రపంచస్థాయి పరంగా చూస్తే మా జట్టు స్థాయి ఇప్పటికీ కొంచెం తక్కువే. దానిని అన్ని విధాలా పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రాథమిక అవసరం. ఈ టెస్టుకు నేనూ హాజరవుతా. ఈ పరీక్షలో విఫలమైతే గేమ్​లో ఉండను. ఈ పరీక్ష ప్రతి ఆటగాడికి అవసరం"

-కోహ్లీ, టీమ్​ఇండియా సారథి

దేశ పౌరులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ధ్యేయంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 'ఫిట్​ ఇండియా ఉద్యమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, గతేడాది ప్రారంభించారు. సెప్టెంబరు 24(ఇవాళ)తో ఏడాది పూర్తయిన సందర్భంగా ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు, శిక్షకులతో గురువారం వర్చువల్​ సమావేశం ద్వారా మోదీ ముచ్చటించారు. ఇందులో భాగంగానే కోహ్లీతో మాట్లాడారు.

ఐపీఎల్​ 13వ సీజన్​తో తన తొలి మ్యాచ్​తో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై విజయం సాధించింది కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు.. తర్వాతి మ్యాచ్​లో నేటి(సెప్టెంబరు 24) సాయంత్రం పంజాబ్​ జట్టుతో తలపడనుంది.

ఇదీ చూడండి ధోనీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసిన రోజు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.