ETV Bharat / sports

ధోనీ, కోహ్లీలను అధిగమించి ఫకర్ ప్రపంచ రికార్డు

author img

By

Published : Apr 4, 2021, 11:29 PM IST

రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్ చేసి ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా పాక్ క్రికెటర్ నిలిచాడు. ఈ క్రమంలో ధోనీ, కోహ్లీ, వాట్సన్​లను అధిగమించాడు.

Fakhar zaman did highest score in ODI in second innings news
ధోనీ, కోహ్లీలను అధిగమించి ఫకర్ ప్రపంచ రికార్డు

పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ వన్డేల్లో రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 193 పరుగులు చేసిన ఇతడు.. రెండో ఇన్నింగ్స్​లో ఎక్కువ పరుగుల చేసిన బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు. ఇతడి తర్వాత స్థానాల్లో షేన్ వాట్సన్(185*), ధోనీ(183*), కోహ్లీ(183) ఉన్నారు.

Fakhar zaman did highest score in ODI
పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన దక్షిణాఫ్రికా.. 341/6 పరుగులు చేసింది. ఛేదనలో ఓ దశలో 120/5తో ఉన్న పాక్​ జట్టులో ఫకర్​ జమాన్ ఒంటరి పోరాటం చేశాడు. దాదాపు గెలిపించినంత పనిచేశాడు. కానీ 193 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్​ కావడం వల్ల సఫారీ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.