ETV Bharat / sports

సీఎస్కేలో రైనా కథ ముగిసినట్లేనా!

author img

By

Published : Aug 31, 2020, 2:07 PM IST

వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్​రౌండర్ సురేశ్ రైనా. అందువల్ల అతడిపై యాజమాన్యం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్​లో జరిగే తర్వాత సీజన్​ కంటే ముందే ఇతడితో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తోందట.

సీఎస్కేలో రైనా కథ ముగిసినట్లేనా!
సీఎస్కేలో రైనా కథ ముగిసినట్లేనా!

ఐపీఎల్​ కోసం యూఏఈకి వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్​ ఫ్రాంచైజీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సిబ్బందికి కరోనా నిర్ధరణ అయింది. అలాగే జట్టు ప్రధాన ఆల్​రౌండర్ సురేశ్ రైనా ఈ ఏడాది లీగ్​ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. దీనిపై యాజమాన్యం సీరియస్​గా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్​లో జరిగే తర్వాత సీజన్​ కంటే ముందే ఇతడితో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తోందట.

"సీఎస్కే సారథి ధోనీ, కోచ్, మేనేజర్​లకు సూట్స్​ ఇచ్చాం. అలాగే రైనాకు కూాడా సూట్​ లభించేది. కానీ గదికి బాల్కనీ లేకపోవడం వల్ల అతడు అసంతృప్తి చెందాడు."

-ఐపీఎల్ సోర్స్

అయితే ఈ పరిస్థితి చూస్తుంటే ఈ సీజన్​కే కాక రైనా తదుపరి సీజన్​కు కూడా దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఓ అధికారి. దీంతో అతడు మళ్లీ సీఎస్కే జెర్సీ ధరించే అవకాశం లేదని తెలుస్తోంది.

"ఓ సీనియర్ క్రికెటర్, అంతర్జాతీయ క్రికెట్​ నుంచి రిటైరై చాలా కాలంగా క్రికెట్​ దూరంగా ఉండి జట్టులోకి రావడం కష్టమే. మళ్లీ అతడు వేలంలో అందుబాటులోకి వస్తే ఎవరైనా అతడిని తీసుకోవచ్చు" అని ఓ అధికారి తెలిపారు.

ప్రస్తుతం సీఎస్కే.. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్​ను సిద్ధం చేసే పనిలో పడింది. అతడు త్వరలోనే కరోనా నుంచి కోలుకుని ట్రైనింగ్ సెషల్​లో పాల్గొంటాడని జట్టు భావిస్తోంది.

రైనా ప్రస్తుతం సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు (4527) సాధించిన బ్యాట్స్​మన్​గా ఉన్నాడు. అలాగే లీగ్​లో ఎక్కువ పరుగులు (5368) చేసిన బ్యాట్స్​మెన్​లో విరాట్ కోహ్లీ (5412) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.