ETV Bharat / sports

ధోనీ రిటైర్మెంట్​పై అతడి మేనేజర్​ ఏమన్నాడంటే?

author img

By

Published : Jul 9, 2020, 10:34 AM IST

టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీకి రిటైర్మెంట్​ ఆలోచనే లేదని అన్నాడు అతడి మేనేజర్ మిహిర్ దివాకర్. ప్రస్తుతం ఐపీఎల్​లో సత్తా చాటేందుకు తన ఫామ్​ హౌస్​లో బాగా శ్రమిస్తున్నాడని తెలిపాడు.

dhoni
ధోనీ

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్​పై స్పందించాడు అతడి మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్. మహీకి క్రికెట్​కు వీడ్కోలు పలకాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశాడు. ధోనీ మాటల్ని, మార్చి నెలలో సీఎస్కే శిక్షణ శిబిరంలో అతడి ప్రాక్టీసు చూస్తుంటే ఈ విషయం తనకు అర్థమైందని తెలిపాడు. ప్రస్తుతానికి ఐపీఎల్‌లో రాణించడమే అతని లక్ష్యమని చెప్పుకొచ్చాడు.

"మేమిద్దరం చిన్ననాటి స్నేహితులమైనప్పటికీ.. క్రికెట్ గురించి మేం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ.. ధోనీ మాటల్ని చూస్తుంటే.. రిటైర్మెంట్ ఆలోచనే లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాణించడమే అతని లక్ష్యం. దానికోసం చెన్నైలో ప్రాక్టీస్ బాగా చేశాడు. ఎంతగానో శ్రమించాడు. ఈ లాక్​డౌన్​లో కూడా ఫామ్​హౌస్​లో ఫిట్​నెస్​ కోసం బాగా కసరత్తులు కూడా చేస్తున్నాడు.

-మిహిర్ దివాకర్, మహీ మేనేజర్.

గతేడాది ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​లో చివరగా ఆడిన ధోనీ.. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. దీంతో పంత్​, కేఎల్​ రాహుల్​ టీమ్​ఇండియా వికెట్​కీపర్​గా​ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే ఐపీఎల్​లో ఆడి, టీ20 ప్రపంచకప్​ జట్టులో చోటు దక్కించుకోవాలని ధోనీ భావించాడు. కానీ కరోనా ప్రభావంతో ప్రపంచకప్​ వాయిదా పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మహీ అంతర్జాతీయ కెరీర్​పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇది చూడండి : టాప్​-5: మ్యాచ్ గమనాన్నే మార్చేసిన ధోనీ నిర్ణయాలు

టాప్​-6: ధోనీ కెరీర్​లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్​లు

ధోనీ క్రికెట్ ప్రయాణంలో ఆ సంఖ్యలే కీలకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.