ETV Bharat / sports

బంతి ఇప్పుడు ధోనీ కోర్టులో.. నిర్ణయం ఎటువైపో..!

author img

By

Published : Jan 16, 2020, 4:06 PM IST

తాజాగా బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కలేదు. ఈ కారణంగా ధోనీ త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Dhoni
ధోనీ

ప్రపంచకప్​ తర్వాత జట్టుకు దూరంగా ఉన్నాడు మహేంద్రసింగ్ ధోనీ. అప్పటి నుంచి ఏ సిరీస్​లోనూ పాల్గొనలేదు. మెగాటోర్నీకి ముందు నుంచీ ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఫలితంగా ధోనీ తప్పుకోవాలంటూ విమర్శలు వచ్చాయి. తాజాగా బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్ల వార్షిక ఒప్పంద జాబితాలోనూ ధోనీకి చోటు దక్కలేదు. ఈ కారణంగా మరోసారి రిటైర్మెంట్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఏడాది జరిగే ఐపీఎల్​లో ధోనీ చెన్నె సూపర్ కింగ్స్​కు సారథ్యం వహించనున్నాడు. ఈ లీగ్​లో ప్రదర్శన ఆధారంగా ధోనీ జట్టులోకి వచ్చే అవకాశముందని కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. త్వరలోనే వన్డే ఫార్మాట్​కు మహీ వీడ్కోలు పలుకుతాడని స్పష్టం చేశాడు.

Dhoni
ధోనీ

"మహీతో నేను ఏకాంతంగా సంభాషించాను. ఏం మాట్లాడామన్నది మా ఇద్దరి మధ్యే ఉంటుంది. అతడు టెస్టు కెరీర్‌ను ముగించాడు. బహుశా త్వరలోనే వన్డేలకు వీడ్కోలు చెప్పేస్తాడు. అతనికప్పుడు టీ20లు మాత్రమే మిగిలుంటాయి. అతడు కచ్చితంగా ఐపీఎల్‌ ఆడతాడు. ఒక్కటి మాత్రం నిజం. తనకు తానుగా ధోనీ జట్టుకు భారమవ్వడు. కానీ అతడు ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది."
-రవిశాస్త్రి, టీమిండియా కోచ్

కానీ ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం సమంజసం కాదని కొందరి వాదన. దగ్గర్లో టీ20 ప్రపంచకప్ ఉన్న కారణంగా ఈ టోర్నీలో మహీ అనుభవం జట్టుకు చాలా అవసరమని క్రికెట్ పండితులు అంటున్నారు. ఇది ధోనీ వ్యక్తిగత అభిప్రాయమని.. అతడే దీనిపై నిర్ణయం తీసుకోవాలని మరికొందరు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ బీసీసీఐ మాత్రం ధోనీ అభిమానులకు ఓ స్పష్టమైన సూచన చేసింది.

Dhoni
ధోనీ

టీమిండియా కెప్టెన్​గా ధోనీకి ఘనమైన రికార్డు ఉంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్​, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఏకైక సారథిగా ఘనత వహించాడు మహీ. ఇప్పటివరకు ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. మొత్తంగా 17 వేల పరుగులు సాధించాడు. కీపర్​గా 829 ఔట్లలో పాలుపంచుకున్నాడు.

ఇవీ చూడండి.. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు జాబితాలో ధోనీకి దక్కని చోటు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Jan 16, 2020 (CCTV - No access Chinese mainland)
1. Screenshot of announcement about text release of phase-one trade deal between China, United States
Washington D.C., USA - Jan 15, 2020 (CCTV - No access Chinese mainland)
2. Various of Chinese Vice Premier Liu He, U.S. President Donald Trump signing phase-one trade deal, shaking hands, posing for photos; Chinese, U.S. officials present
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
3. Various of Tian'anmen Square, Chinese national flag
FILE: Washington, D.C., USA - Date Unknown (CGTN - No access Chinese mainland)
4. Various of U.S. Capitol, U.S. national flag
FILE: Shanghai Municipality, east China - Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Wall showing logo, name of China (Pudong) Intellectual Property Protection Center
6. Various of people at China (Pudong) Intellectual Property Protection Center
FILE: Beijing, China - Dec 2018 (CCTV - No access Chinese mainland)
7. Various of supermarket, shoppers
FILE: Shanghai Municipality, east China - Aug 27, 2019 (CGTN - No access Chinese mainland)
8. Shoppers at supermarket checkout counter
FILE: Washington D.C., USA - Date Unknown (CGTN - No access Chinese mainland)
9. Various of consumers in supermarket
FILE: Fairmount, Illinois, USA - Nov 2018 (CGTN - No access Chinese mainland)
10. Various of combine harvesters collecting soybeans
FILE: California, USA - 2017 (CGTN - No access Chinese mainland)
11. Various of avocado packing facility, employees at work
FILE: Des Moines, Iowa, USA - Sept 9, 2018 (CCTV - No access Chinese mainland)
12. Farmer checking on pigs
13. Pigs
FILE: Ningbo City, Zhejiang Province, east China - Date Unknown (CGTN - No access Chinese mainland)
14. Various of Ningbo-Zhoushan Port scenes
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
15. Aerial shots of cargo ship, port
Chinese authorities released the signed text of the phase-one economic and trade agreement between China and the United States on Thursday.
Chinese Vice Premier Liu He and U.S. President Donald Trump inked the historic deal at the White House on Wednesday. The signing of the agreement marks a major breakthrough after the world's two largest economies have spent nearly two years embroiled in an often bitter trade dispute that imposed tit-for-tat levies on each other's commodities, mechanical parts and finished goods.
The text was jointly issued by China's Ministry of Finance, National Development and Reform Commission, Ministry of Agriculture and Rural Affairs, Ministry of Commerce and People's Bank of China.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.