ETV Bharat / sports

కరోనా దెబ్బకు బీసీసీఐ మరో కీలక నిర్ణయం

author img

By

Published : Mar 16, 2020, 8:03 PM IST

COVID-19: BCCI to shut down office, employees told to work from home
ప్రధానకార్యాలయ్యాన్ని మూసివేసిన బీసీసీఐ

కరోనా నేపథ్యంలో ముంబయిలోని తమ ప్రధాన కార్యాలయాన్ని మూసేసింది బీసీసీఐ. ఉద్యోగులందరినీ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

బీసీసీఐకి కరోనా వైరస్‌ విచిత్రమైన పరిస్థితులను పరిచయం చేస్తోంది. ఇప్పటికే కొవిడ్‌-19 ముప్పుతో ఐపీఎల్‌ సహా దేశవాళీ క్రికెట్‌ మ్యాచులన్నీ వాయిదా వేసింది. తాజాగా ముంబయిలోని ప్రధాన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులందరినీ మంగళవారం నుంచి ఇంటివద్ద నుంచే పని చేయాలని ఆదేశించింది.

"కొవిడ్‌-19 మహమ్మారి వల్ల వాంఖడే స్టేడియం వద్దనున్న ప్రధాన కార్యాలయం మూసివేస్తున్నామని ఉద్యోగులందరికీ తెలిపాం. మంగళవారం నుంచి అందరూ ఇంటివద్ద నుంచే పనిచేయాలని ఆదేశించాం."

-బీసీసీఐ.

కరోనాను కట్టడి చేసేందుకు జనసమ్మర్థం లేకుండా చూడాలని బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడాశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 15 వరకు ఐపీఎల్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. అంతర్జాతీయ, దేశవాళీ సిరీసులను రద్దు చేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ముంబయిలో కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. భారత్‌లో ఇప్పటి వరకు 114 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి : ప్రపంచాన్ని ఇలా చూడటం కష్టంగా ఉంది: రోహిత్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.