ETV Bharat / sports

ఐపీఎల్​ జరిగితే జీతాల్లో కోతలు ఉండవు: గంగూలీ

author img

By

Published : May 15, 2020, 2:43 PM IST

BCCI president Sourav Ganguly opens up about pay cuts
ఐపీఎల్​ జరిగితే జీతాల్లో కోతలు ఉండవు: గంగూలీ

ఈ ఏడాది ఐపీఎల్​ జరిగితే క్రికెటర్ల వేతనాల్లో కోత ఉండదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ వెల్లడించాడు. టోర్నీ జరగకపోతే రూ.4 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిపాడు.

ఐపీఎల్​ సీజన్​-13 ఎప్పుడు జరిగినా ఆటగాళ్ల వేతనాల్లో కోత ఉండదని స్పష్టం చేశాడు భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. టోర్నీ జరగకపోతే మండలికి దాదాపు రూ.4వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపాడు.

"బీసీసీఐ ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వత దాన్ని బట్టి ముందడుగు వేయాలి. ఐపీఎల్​ నిర్వహించకపోతే రూ.4వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఒకవేళ ఐపీఎల్​ జరిగితే ఆటగాళ్లకు వేతనాల్లో కోతలు లేకుండా మేము చూస్తాము".

- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

కరోనా కారణంగా ప్రపంచ దేశాలు విధించిన ప్రయాణ పరిమితులను పరిగణలోకి తీసుకుంటే ఐపీఎల్​ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. టోర్నీలన్నీ ప్రారంభమైన తర్వాత ఐపీఎల్​ జరపడానికి బీసీసీఐ ఎలాంటి ప్రణాళికలు చేస్తుందో చూడాల్సి ఉంది.

ఈ ఏడాది మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్​ 13వ సీజన్​ లాక్​డౌన్​ కారణంగా మొదట ఏప్రిల్​ 15కు వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ఎక్కువ అవ్వడం వల్ల లీగ్​ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఉండవు

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్​లో టీమ్​ఇండియా పాల్గొనాల్సి ఉంది. కానీ అందుకు అదనంగా మరో టెస్టును నిర్వహించే అవకాశం ఉందంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఇరుదేశాల మధ్య మొత్తం ఐదు టెస్టులు జరుగుతాయని చెప్పింది. కానీ ఈ ప్రతిపాదనను బీసీసీఐ కొట్టిపారేసింది. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్​లో ఐదు టెస్టుల నిర్వహణ సాధ్యం కాదని గంగూలీ స్పష్టం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్​ అనుకున్న ప్రకారం జరుగుతుందని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి.. సచిన్​, రోహిత్​, దియా మీర్జాలకు యువీ ఛాలెంజ్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.