ETV Bharat / sports

సఫారీ స్టార్ బ్యాట్స్​మన్ ​డివిలియర్స్​ రీఎంట్రీ..!

author img

By

Published : Dec 15, 2019, 8:31 PM IST

AB de Villiers
దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్​ ఏబీ డివిలియర్స్​ రీఎంట్రీ..!

దక్షిణాఫ్రికా జట్టు సీనియర్​ క్రికెటర్​ ఏబీ డివిలియర్స్​.. ఆ దేశ జాతీయ జట్టులో మళ్లీ కనిపించే అవకాశాలున్నాయి. ఇటీవలే పనిభారం కారణంగా అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించిన మిస్టర్​ 360.. మళ్లీ సఫారీ జట్టు జెర్సీ ధరించవచ్చని నూతన కోచ్​ మార్క్​ బౌచర్​ అభిప్రాయపడ్డాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​లో ప్రొటీస్​ తరఫున ఆడతాడని తెలిపాడు.

ఒకప్పుడు అగ్రశ్రేణి జట్టుగా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా... ప్రస్తుతం సరైన నాయకత్వం, సీనియర్​ క్రీడాకారులు లేక సతమతమవుతోంది. అందుకే దేశంలో క్రికెట్​ను, జట్టును రక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది సఫారీ క్రికెట్​ బోర్డు. ఇందులో భాగంగానే మాజీ క్రికెటర్, ప్రపంచ టాప్​ సారథుల్లో ఒకరైన​​ గ్రేమ్​ స్మిత్​ను బోర్డు అధ్యక్షుడిగా నియమించి, ప్రధాన కోచ్​గా మార్క్​ బౌచర్​కు పదవీ బాధ్యతలు అప్పగించింది. వీరిద్దరి రాకతో మళ్లీ సఫారీ జట్టులో పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నారు ప్రొటీస్​ జట్టు అభిమానులు. తాజాగా వారి ఆశలకు బలం చేకురుస్తూ మాజీ క్రికెటర్​, టాప్​ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్​ను జట్టులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు బౌచర్​.

AB de Villiers Possible Return
దక్షిణాఫ్రికా కోచ్​ మార్క్​ బౌచర్​

" డివిలియర్స్​ అత్యుత్తమ ఆటగాడు. అతడిలో జాతీయ జట్టుకు ఆడే సత్తా ఇంకా ఉంది. ఏబీ తన రిటైర్మెంట్‌పై మళ్లీ ఆలోచించాలని కోరతాను. అతడితో పాటు మరికొంతమంది మాజీ ఆటగాళ్లతోనూ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. అత్యుత్తమ ఆటగాళ్లతో జట్టును ప్రక్షాళన చేసేందుకే కోచ్​గా పదవీ బాధ్యతలు చేపట్టాను".
- మార్క్​ బౌచర్​, దక్షిణాఫ్రికా కోచ్​

వరల్డ్​ కప్​ కోసమేనా..!

గతేడాది ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ తర్వాత... డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్​బై చెప్పేశాడు. జాతీయ జట్టులో ఆడటం వల్ల పనిభారం ఎక్కువ అయిపోయిందని వెల్లడించాడు. ఈ కారణంతో జట్టు నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ జరిగినప్పుడు మళ్లీ జట్టు తరఫున ఆడటానికి డివిలియర్స్‌ ప్రయత్నాలు చేశాడు. కానీ అవి ఫలించలేదు. అయితే వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​ కోసం ఇతడిని వెనక్కి పిలుస్తున్నట్లు తెలుస్తోంది​.

ఐపీఎల్​లో మాత్రమే...

2018 మే నెలలో జట్టుకు రిటైర్మెంట్‌ ప్రకటించిన డివిలియర్స్‌.. ఆ తర్వాత ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ఆడలేదు. ఐపీఎల్‌ 2019లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన ఏబీడీ మొత్తం 13 మ్యాచ్‌ల్లో 44.20 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్‌లో ఆడాలనుకున్నా అవకాశం​ దక్కలేదు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. No use in Norway. Norway must be excluded from all broadcast and digital rights. Maximum footage use of 3 minutes, apart from TV2 Norway who are restricted to 90 seconds maximum use. Footage must be removed after 48 hours from end of race. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com
BROADCAST: Regularly scheduled, non-sponsored news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Anna Meares Velodrome, Brisbane, Australia. 15th December 2019.
Women's Omnium - Scratch Race:
1. 00:00 Several riders collide leading to the majority of the field crashing out with two laps remaining
2. 00:13 Replay of the crash
SOURCE: IMG Media
DURATION: 00:30
STORYLINE:
There was a huge, multi-rider crash in the women's Omnium Scratch race on the final day of competition at the UCI Track Cycling World Cup in Brisbane on Sunday.
On the penultimate lap, two riders in the chase group clipped wheels and they fell hard onto the hard wood track at the Anna Meares Velodrome, with at least 10 riders behind them flying off their bikes in the ensuing melee.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.