ఇంగ్లాండ్​లో ఇరగదీస్తున్న పుజారా, వన్డేల్లో వరుసగా రెండో సెంచరీతో విధ్వంసం

author img

By

Published : Aug 14, 2022, 8:46 PM IST

Cheteshwar Pujara
పుజారా ()

Pujara Century భారత క్రికెటర్​, టెస్టు స్పెషలిస్ట్​ ఛెతేశ్వర్​ పుజారా భీకర ఫామ్​లో ఉన్నాడు. ఇంగ్లాండ్​లో జరుగుతున్న రాయల్​ లండన్​ కప్​ వన్డే ఛాంపియన్​షిప్​​లో ససెక్స్​ జట్టు తరఫున వరుసగా రెండో సెంచరీ చేయడం విశేషం.

Pujara Century: గంటల తరబడి క్రీజులో పాతుకుపోయే టెస్టు స్పెషలిస్ట్​, భారత బ్యాటర్​ ఛెతేశ్వర్​ పుజారా విధ్వంసక ఇన్నింగ్స్​ ఆడాడు. నెమ్మదైన ఆటను వదిలి చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్​లో జరుగుతున్న రాయల్​ లండన్​ కప్​ వన్డే ఛాంపియన్​షిప్​​లో ససెక్స్​ జట్టుకు ఆడుతున్న పుజారా.. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. ఇవి రెండు రోజుల వ్యవధిలోనే రావడం విశేషం.

వార్విక్​షైర్​పై శుక్రవారం జరిగిన మ్యాచ్​లో 79 బంతుల్లో 107 పరుగులు చేసిన పుజారా.. ఇప్పుడు సర్రేపై 131 బంతుల్లో 174 రన్స్​ బాదాడు. ఇది లిస్ట్​ ఏ క్రికెట్​లో అతడి కెరీర్​ బెస్ట్ స్కోర్​​. 9 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్​కు వచ్చిన పుజారా.. మంచి స్కోరు అందించాడు. టామ్​ క్లార్క్​తో కలిసి మూడో వికెట్​కు 205 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 103 బంతుల్లో శతకం సాధించిన భారత బ్యాటర్​.. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడాడు. 28 బంతుల్లోనే తర్వాతి 74 పరుగులు చేయడం విశేషం.
తన ఇన్నింగ్స్​లో 20 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. పుజారా బాదుడుతో ససెక్స్​ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసింది.

శుక్రవారం వార్విక్‌షైర్‌పై 311 పరుగుల ఛేదనలోనూ ఈ కుడి చేతి వాటం బ్యాటర్‌ మెరుపు శతకం బాదాడు. చెలరేగి ఆడిన అతడు 79 బంతుల్లోనే 107 పరుగులు చేశాడు ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. ఒక ఓవర్లో 22 పరుగులు రాబట్టడం విశేషం. అయితే ఈ మ్యాచ్​లో పుజారా జట్టు ఓడిపోయింది. 49వ ఓవర్‌ తొలి బంతికి పుజారా ఔట్‌ కావడంతో.. చివరికి ససెక్స్‌ 7 వికెట్లకు 306 పరుగులే చేసింది. వార్విక్‌షైర్‌ తరఫున ఆడిన భారత ఆఫ్‌ స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్య (3/51) విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు వార్విక్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో రాబర్ట్‌ యాట్స్‌ (114) సెంచరీ చేయగా.. విల్‌ రోడ్స్‌ (76), బర్జెస్‌ (58) రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించారు.

ఇవీ చదవండి: కొద్దిరోజుల్లో ఆసియా కప్ షురూ​, ఈ విషయాల గురించి తెలుసా

సచిన్​ తొలి సెంచరీ ఎప్పుడు చేశాడో గుర్తుందా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.