ETV Bharat / sports

'దేశం కోసం ఆడుతున్నప్పుడు ఆ ఫైర్​ ఉండటం సహజమే'

author img

By

Published : Jan 18, 2022, 12:49 PM IST

bumrah
బుమ్రా

Bumrah Jansen Argument: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో భాగంగా రెండో టెస్టులో టీమ్​ఇండియా బౌలర్ బుమ్రాతో జరిగిన గొడవపై స్పందించాడు సౌతాఫ్రికా బౌలర్ జాన్సన్. దేశం కోసం ఆడుతున్నప్పుడు అవి సహజమే అని చెప్పాడు.

Bumrah Jansen Argument: సొంతగడ్డపై టీమ్​ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్​లో విజయం సాధించింది దక్షిణాఫ్రికా. అయితే.. జోహన్నెస్​బర్గ్​లో జరిగిన రెండో టెస్టులో భాగంగా భారత పేసర్ బుమ్రా, ప్రొటీస్ బౌలర్ జాన్సన్​ మధ్య వాగ్వాదం జరిగింది. ఐపీఎల్​లో ఇద్దరు ఆటగాళ్లూ ముంబయి ఇండియన్స్​ తరఫున ఆడుతున్నా ఈ వివాదం తలెత్తడం గమనార్హం. తాజాగా.. దీనిపై స్పందించాడు సౌతాఫ్రికా ఆటగాడు జాన్సన్. సొంత దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అని చెప్పుకొచ్చాడు.

"బుమ్రా, నేను ఐపీఎల్​లో ఒకే జట్టులో ప్రాతినిధ్యం వహించాం. మేం మంచి మిత్రులం కూడా. కానీ, కొన్నిసార్లు పరిస్థితులు వేరేలా ఉంటాయి. దేశం కోసం ఆడినప్పుడు ఎవ్వరూ తగ్గరు. రెండో టెస్టులో జరిగింది ఇదే. కానీ, దాని గురించి పెద్దగా ఆలోచించను."

--జాన్సన్, దక్షిణాఫ్రికా పేసర్.

రెండో టెస్టులో బుమ్రా క్రీజులో ఉన్నప్పుడు వరుస బౌన్సర్​ బంతులతో జాన్సన్​ ఇబ్బందిపెట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. అంపైర్​ చొరవతో వివాదం చల్లబడింది.

అదే ఊపులో వన్డే సిరీస్​..

IND vs SA ODI Series: టెస్టు సిరీస్​ గెలిచిన ఊపులోనే భారత్​తో వన్డే సిరీస్​ కూడా గెలిచేందుకు ప్రయత్నిస్తామని పేసర్ జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ, టీమ్​ఇండియా మేటి జట్టు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని తెలిపాడు. భారత్​ను పూర్తిగా అర్థం చేసుకోవడం విఫలం అవుతున్నట్లు తెలిపాడు. పక్కా ప్రణాళికతో వన్డే సిరీస్​ ఆడుతామని పేర్కొన్నాడు.

కాగా, టీమ్​ఇండియా-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​ బుధవారం(జనవరి 19) ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఇరు జట్లు ప్రాక్టీస్​ సెషన్​లో చెమటోడ్చుతున్నాయి.

ఇదీ చదవండి:

IND vs SA: చేజారిన సిరీస్​.. బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణమా?

100వ టెస్టుకు కెప్టెన్సీ ఆఫర్​.. తిరస్కరించిన కోహ్లీ!

టీమ్​ఇండియా విచిత్రమైన రికార్డు.. టెస్టులో 20 వికెట్లు క్యాచ్​ అవుట్​లే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.