ETV Bharat / sports

క్రికెట్​లో ఆల్​టైమ్ బెస్ట్ క్యాచ్- వీడియో చూశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 8:57 PM IST

Updated : Jan 13, 2024, 9:16 PM IST

Best Catch In Cricket History: సూపర్ స్మాష్ లీగ్​ టోర్నమెంట్​లో క్రికెట్​ చరిత్రలో అద్భుతమైన క్యాచ్ నమోదైంది. ఈ క్యాచ్ వీడియో మీరు చూశారా?

Best Catch In Cricket History
Best Catch In Cricket History

Best Catch In Cricket History: న్యూజిలాండ్ డొమెస్టిక్ లీగ్ సూపర్ స్మాష్ (Super Smash) టోర్నమెంట్​లో క్రికెట్ హిస్టరీలో బెస్ట్ క్యాచ్ నమోదైంది. శనివారం (జనవరి 13) టోర్నీలో భాగంగా విల్లింగ్టన్(Wellington)- సెంట్రల్ డిస్ట్రిక్ట్స్​ (Central Districts) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో సెంట్రల్ స్టాగ్స్ ఇన్నింగ్స్​లో ఆరో ఓవర్ రెండో బంతిని ఓపెనింగ్ బ్యాటర్ విల్​ యంగ్ లాంగ్​ ఆన్ దిశగా భారీ షాట్​ బాదాడు. దీంతో బంతి అమాంతం గాల్లోకి లేచింది.

అక్కడే 30 యార్డ్​ సర్కిల్​లో ఫీల్డింగ్ చేస్తున్న విల్లింగ్టన్​ ప్లేయర్ నిక్​ కెల్లి (Nick Kelly), స్పీడ్​గా పరిగెత్తుతూ బంతిని అందుకొని డైవ్​ చేశాడు. అతడు బౌండరీలోకి ఎంటర్ అవ్వకముందే బంతిని వెనక్కి విసిరాడు. కెల్లి వెంబడి పరిగెత్తిన ట్రాయ్ జాన్సన్ వెంటనే ఆ బంతిని అందుకొని క్యాచ్​ను పూర్తి చేశాడు. అంతే ఒక్కసారిగా ఈ క్యాచ్​ను చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడిలో వైరలైంది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్తమమైన క్యాచ్​ల్లో ఇది ఒకటి అని కామెంట్ చేస్తున్నారు.

Du Plessis Catch SA T20 League: మరోవైపు సౌతాఫ్రికా టీ20 లీగ్​లోనూ అత్యుత్తమ క్యాచ్ నమోదైంది. టోర్నీలో భాగంగా శనివారం (జనవరి 13) ఎమ్​ఐ కేప్​టౌన్- జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో ఎమ్​ఐ బ్యాటర్ డివాల్డ్ బ్రేవిస్ భారీ షాట్ ఆడబోయి బంతిని గాల్లోకి లేపాడు. దీంతో ఫీల్డింగ్​ చేస్తున్న జోబర్గ్ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ చురుగ్గా స్పందించి, అమాంతమ గాల్లోకి ఎగిరి ఒక్క చేత్తో బంతిని అందుకున్నాడు.

39 ఏళ్ల వయసులోనూ అసాధారణ రీతిలో క్యాచ్ అందుకున్న డూప్లెసిస్​కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎమ్​ఐ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు రస్సీ వాన్​డర్​ డస్సెన్ (104), రియాన్ రికెట్లన్ (98) తుఫాన్ ఇన్నింగ్స్​తో చెలరేగారు. అనంతరం ఛేదనలో డూప్లెసిస్​ (6) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు.

టవల్​తో క్యాచ్ - 5 పరుగుల పెనాల్టీ - క్రికెట్​లో ఈ రూల్ మీకు తెలుసా?

Jadeja Drop Catch : 'ఏంటీ జడ్డూ.. నువ్వేనా క్యాచ్ మిస్ చేసింది'

Last Updated : Jan 13, 2024, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.