ETV Bharat / sports

స్టంప్స్​కు బంతి ముద్దిచ్చింది.. స్టోక్స్ బతికిపోయాడు!

author img

By

Published : Jan 7, 2022, 2:21 PM IST

stokes ashes, స్టోక్స్ యాషెస్
స్టోక్స్

Stokes Ashes: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్టులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ స్టోక్స్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే!

Stokes Ashes: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్టులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ స్టోక్స్​ ఔటవకుండా బతికిపోయాడు. ఇది చూసిన ఆసీస్ క్రికెటర్లతోపాటు అంపైర్లు, ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే!

ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కామెరూన్ గ్రీన్ 30వ ఓవర్ వేశాడు. ఇతడి బౌలింగ్​లో బెన్ స్టోక్స్​ ఓ బంతిని ఆడకుండా వదిలేశాడు. అయితే అది ఎల్బీడబ్ల్యూగా భావించిన అంపైర్ ఔట్​గా ప్రకటించాడు. తర్వాత స్టోక్స్ రివ్యూ కోరగా.. అసలు విషయం అర్థమైంది. అసలు ఆ బంతి తాకింది ప్యాడ్స్​కు కాదు.. నేరుగా ఆఫ్ స్టంప్​ను తాకింది. కానీ అదృష్టవశాత్తు బెయిల్స్ కిందపడలేదు. దీంతో స్టోక్స్ నాటౌట్​గా బతికిపోయాడు. ఈ వీడియో కాస్తా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

కాగా చివరికి 66 పరుగులు చేసిన స్టోక్స్‌.. లియోన్ బౌలింగ్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. బెయిర్​ స్టో (103) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో వుడ్ (39) మెరుపులు మెరిపించడం వల్ల మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్​లో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది ఇంగ్లాండ్. మొదటి ఇన్నింగ్స్​లో 416 పరుగులకు డిక్లేర్ చేసిన ఆసీస్.. ఇంకా 158 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇవీ చూడండి: 'ఆట మార్చుకోవాలని పంత్​కు చెప్పలేం.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.