ETV Bharat / sports

IPL 2022: వచ్చే ఏడాది ఐపీఎల్ మనదేశంలోనే..

author img

By

Published : Oct 17, 2021, 10:25 AM IST

ipl 2022 news
సౌరవ్ గంగూలీ

భారత్​లో ఐపీఎల్​కు ఉండే క్రేజే వేరు. భారీ సంఖ్యలో వచ్చే అభిమానులు.. మైదానాన్ని హోరెత్తిస్తారు. అలాంటి ఐపీఎల్​.. ఈ ఏడాది కరోనా కారణంగా వాయిదా పడి రెండో దశలో యూఏఈలో విజయవంతంగా జరిగింది. వచ్చే ఏడాది (IPL 2022) మాత్రం అశేష ప్రేక్షకుల నడుమ భారత్​లోనే జరగుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్) 15వ సీజన్.. భారత్​లోనే (IPL 2022) జరుగుతుందని ఆశిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. కరోనా కారణంగా టోర్నీ(IPL 2021) రెండో దశ యూఏఈలో జరిగింది. వచ్చే ఐపీఎల్​ మాత్రం అఖండ ప్రేక్షకుల మధ్య మనదేశంలోనే నిర్వహిస్తామని దాదా (Sourav Ganguly Latest News) ఆశాభావం వ్యక్తం చేశాడు.

"దుబాయ్​లో అదిరిపోయే వాతావరణం ఉంది. అయితే భారత్​లో పరిస్థితి వేరుగా ఉంటుంది. స్టేడియం నిండిపోయి.. అభిమానులు ఉర్రుతలూగిపోతారు. అశేష ప్రేక్షకుల మధ్య భారత్​లోనే వచ్చే ఏడాది ఐపీఎల్​ నిర్వహిస్తామని అశిస్తున్నా. వచ్చే 8 నెలల్లో కరోనా పరిస్థితి కూడా పూర్తి భిన్నంగా ఉంటుంది."

- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

కరోనా కారణంగానే భారత్​లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ (T20 World Cup 2021) యూఏఈ, ఒమన్​ వేదికలుగా జరుగుతోంది. ఇప్పటివరకు 8 జట్లతో జరిగిన ఐపీఎల్​లో వచ్చే ఏడాది కోసం కొత్తగా మరో 2 జట్లు (IPL 2022 New Teams) చేరనున్నాయి. ఐపీఎల్ 14 ఫైనల్లో కోల్​కతాపై ఘనవిజయం సాధించి నాలుగోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది చెన్నై సూపర్​ కింగ్స్.

ఇదీ చూడండి: T20 World Cup 2021: నేటి నుంచే టీ20 ప్రపంచకప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.