ETV Bharat / sports

రవిశాస్త్రి, కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం!

author img

By

Published : Sep 7, 2021, 1:59 PM IST

BCCI miffed at Ravi Shastri, Virat Kohli
రవిశాస్త్రి, కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం

తమ అనుమతి లేకుండా లండన్​లోని ఓ బుక్​లాంచ్​ ఈవెంట్​కు టీమ్​ సభ్యులు హాజరవడం పట్ల కోచ్ రవిశాస్త్రి(team India coach), కెప్టెన్ విరాట్ కోహ్లీపై(team India captain) బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వారిని బోర్డు వివరణ కోరినట్లు సమాచారం.

టీమ్​ఇండియా కోచ్ రవిశాస్త్రి(team India coach Ravi Shastri), కెప్టెన్ విరాట్ కోహ్లీపై(Virat Kohli BCCI).. బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గతవారం రవిశాస్త్రి, కోహ్లీ సహా పలువురు లండన్​లో జరిగిన ఓ బుక్​ లాంచ్​ ఈవెంట్​కు హాజరయ్యారు. ఫలితంగా రవిశాస్త్రికి (Ravi Shastri corona) కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఆ తర్వాత రోజే బౌలింగ్​ కోచ్​ భరత్​ అరుణ్​, ఫీల్డింగ్​ కోచ్​ ఆర్​ శ్రీధర్​లకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. టీమ్​ఇండియా ఫిజియో నితిన్ పటేల్​ కూడా ఐసోలేషన్​లో ఉన్నారు.

ఈ విషయంపై కోహ్లీ, శాస్త్రిల నుంచి బోర్డు వివరణ కోరినట్లు తెలుస్తోంది. బుక్​ లాంచ్​ ఈవెంట్​కు వెళ్లడానికి టీమ్​ సభ్యులు.. బీసీసీఐ(BCCI England tour) అనుమతి కోరలేదని తెలిసింది. ఇంగ్లాండ్​ అండ్​ వేల్స్​ క్రికెట్​ బోర్డు (England and Wales cricket board) అనుమతి కూడా లేకుండా ఈవెంట్​కు హాజరైనట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు.. విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.

"ఈ ఈవెంట్ ఫొటోలు ఇప్ప‌టికే బీసీసీఐ అధికారుల‌కు చేరాయి. దీనిపై బోర్డు విచార‌ణ జ‌రుపుతుంది. ఇది బోర్డుకు మచ్చ తీసుకొచ్చింది. కోహ్లి, శాస్త్రిల‌ను బోర్డు వివ‌ర‌ణ కోరుతుంది. వీరంతా.. ఈవెంట్‌కు వెళ్ల‌డంలో టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ గిరీష్ డోంగ్రె పాత్ర‌ను కూడా బోర్డు ప‌రిశీలిస్తోంది" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

బుధవారం జరగనున్న టీ20 ప్రపంచకప్ టీమ్ (India team for T20 world cup 2021)​ ఎంపిక సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందన్నారు అధికారులు. భవిష్యత్​లో ఇలాంటి సంఘటనలు జరగకుండా టెస్టు​ సిరీస్​ను​ ముగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇలాంటి ఈవెంట్‌ల‌కు వెళ్లొద్దంటూ బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా.. ప్రతి ఆటగాడికి ప్ర‌త్యేకంగా నోటీసులు పంపినా.. వారు నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించడాన్ని బోర్డు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది.

ఇదీ చూడండి: బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.