ETV Bharat / sports

'పాక్​ కెప్టెన్ నేనే' అని చెప్పుకుంటున్న బాబర్.. ఇంతకీ ఏమైంది?

author img

By

Published : Sep 10, 2022, 4:16 PM IST

ఆసియా కప్ 2022 లో భాగంగా శ్రీలంక-పాకిస్థాన్ మధ్య జరిగిన ఆఖరి సూపర్ 4 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్​ చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..

f
babar azam stats

ఆసియా కప్​ భాగంగా ఆఖరి సూపరి4 మ్యాచ్​లో పాకిస్థాన్​పై శ్రీలంక విజయం సాధించింది. ఈ రెండు జట్లు మళ్లీ ఫైనల్​లో​ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్​లో జరిగిన ఆసక్తికర ఘటనకు సంబంధించిన వైరల్​గా మారింది. లంక ఇన్నింగ్స్​ 16వ ఓవర్లో హసన్ అలీ వేసిన బంతి బౌన్సర్​గా కీపర్​ చేతిలో పడింది. వెంటనే మహమ్మద్ రిజ్వాన్ రివ్యూ కోసం సిగ్నల్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్ సైతం కెప్టెన్ ఎవరనే విషయం మరిచి థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు.

దాంతో తీవ్ర అసహనానికి గురైన బాబర్.. 'కెప్టెన్ నేనే' అంటూ సైగలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే తాను రివ్యూ అడగకుండానే ఎలా సమీక్ష కోరతారని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు. నిబంధనల ప్రకారం ఫీల్డింగ్ టీమ్ రివ్యూ తీసుకోవాలంటే కెప్టెన్ మాత్రమే కోరాలి. కానీ ఇక్కడ రిజ్వాన్ అడగ్గానే రివ్యూ కోరడం చర్చనీయాంశమైంది.

ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు ఫీల్డ్‌లో కెప్టెన్సీ చేయాలని, మొత్తం రిజ్వాన్‌కు అప్పగించి పక్కన కూర్చుంటే ఇలానే ఉంటుందని సెటైర్లు పేల్చుతున్నారు. గత కొన్ని రోజులు రిజ్వాన్ జోక్యం ఎక్కువైందని, దాంతో అంపైర్ అనిల్ చౌదరి అయోమయానికి గురయ్యాడని కామెంట్లు పెట్టారు. ఒక కెప్టెన్.. తానే సారథి అని చెప్పుకోవాల్సి రావడం ఎంతటి కర్మ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇవీ చదవండి: 'కోచ్‌గా ద్రవిడ్​ హనీమూన్‌ కాలం ముగిసింది.. ఇక జట్టుపై దృష్టి పెట్టాలి'

90 మీటర్ల మార్క్‌.. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: నీరజ్‌ చోప్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.