ETV Bharat / sports

Asia Cup 2023 : పాకిస్థాన్​లోనే ఆసియా కప్.. హైబ్రిడ్ మోడల్‌కు ఏసీసీ గ్రీన్ సిగ్నల్!

author img

By

Published : Jun 11, 2023, 3:07 PM IST

Updated : Jun 11, 2023, 5:37 PM IST

Asia Cup 2023 Hybrid Model : ఆసియా కప్​ నిర్వహణ విషయంలో పాకిస్థాన్​ ప్రతిపాదించిన హైబ్రిడ్​ మోడల్​కే ఆసియా క్రికెట్​ మండలి (ఏసీసీ) మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏసీసీ మంగళవారం ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

Asia Cup 2023 Hybrid Model
Asia Cup 2023 Hybrid Model

Asia Cup 2023 Hybrid Model : ఆసియా కప్​ నిర్వహణ విషయంలో పాకిస్థాన్​ ప్రతిపాదించిన హైబ్రిడ్​ మోడల్​కు​ ఆసియా క్రికెట్​ మండలి(ఏసీసీ) ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఆ ప్రదిపాదనను ఏసీసీ ఆమెదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఏసీసీ అధ్యక్షుడు జై షా మంగళవారం ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

పాక్​ ప్రదిపాందించిన ఈ హైబ్రిడ్​ మోడల్​లో భాగంగా నాన్ ఇండియా మ్యాచ్​లు అయిన పాకిస్థాన్​-నేపాల్​, బంగ్లాదేశ్​-ఆఫ్గనిస్థాన్​, ఆఫ్ఘనిస్థాన్-శ్రీలంక, శ్రీలంక-బంగ్లాదేశ్​ మ్యాచ్​లను లాహోర్​లోని గడాఫీ స్టేడియంలో నిర్వహిస్తారని.. మిగతా వాటిని శ్రీలంకలో నిర్వహించే అవకాశం ఉందని ఏసీసీ బోర్డు సభ్యుడు ఒకరు తెలిపినట్లు సమాచారం. ఆసియా కప్​ 2023 సెప్టెంబర్​లో ప్రారంభం కానుంది.

ఇప్పటివరకు భారత్​, పాక్​ క్రికెట్‌ బోర్డుల మధ్య సందిగ్ధత నెలకొంది. తమ దేశంలోని వేదికలపై ఆసియా కప్‌లో భారత్‌ ఆడకపోతే.. తాము వరల్డ్​కప్‌ కోసం ఇండియాలో పర్యటించమని పాక్‌ చెప్పింది. పాక్‌ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ను బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ను చూడలేమని అంతా భావించారు. కానీ తాజా పరిణామంతో ప్రేక్షకులలో మళ్లీ ఆశలు చిగురించాయి.

Asai cup Pakisthan : అంతకుముందు యూఏఈని తటస్థ వేదికగా పాకిస్థాన్ ప్రతిపాదించింది. అయితే అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ఆ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. శ్రీలంక కూడా ఇదే కారణంతో యూఏఈలో ఆడటానికి మొగ్గు చూపలేదు. అయితే, అప్పటినుంచి వేదికగా శ్రీలంక పేరు వినిపించింది. ఈ వేదికకు పాక్​ ఒప్పుకోక పోతే.. ఆ దేశం లేకుండా టోర్నీ జరుగుతుందని.. వార్తలు వచ్చాయి.

Asia cup 2023 BCCI : ఆసియా కప్‌ నిర్వహణపై పాకిస్థాన్ పట్టు విడవకపోతే.. ఆసియా కప్​ రద్దు చేసేందుకు ఏసీసీ బోర్డు సిద్ధమైనట్లు అంతకుముందు ప్రచారం జరిగింది. ఈ ఆసియా కప్​ టోర్నీ స్థానంలో ఐదు దేశాల టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. కాగా, గతేడాది ఆసియా కప్‌ టీ20 మెగా టోర్నీలో భారత్‌, పాకిస్థాన్​, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్​లతో పాటు హాంగ్‌ కాంగ్‌ హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే ఈ మెగా ఈవెంట్‌లో శ్రీలంక ట్రోఫీని సొంతం చేసుకోగా.. పాకిస్థాన్​ రన్నరప్‌గా నిలిచింది.

Last Updated : Jun 11, 2023, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.