ETV Bharat / sports

Asia Cup 2023 Babar Azam : బాబర్‌ ఆజమ్ సంచలనం.. కోహ్లీ అందుకున్న రెండు వరల్డ్​ రికార్డ్స్​ బ్రేక్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 10:27 AM IST

Asia Cup 2023 Babar Azam : ఆసియా కప్​ 2023లో భాగంగా జరిగిన పాక్​-నేపాల్ మ్యాచ్​లో పాక్ కెప్టెన్ బాబర్‌ ఆజమ్​ అదిరిపోయే రికార్డులు సాధించాడు. కోహ్లీ రికార్డులను కూడా బ్రేక్ చేసేశాడు. ఆ వివరాలు..

Asia Cup 2023 Babar Azam : బాబర్‌ అజామ్ సంచలనం.. కోహ్లీ రెండు వరల్డ్​ రికార్డ్స్​ బ్రేక్​!
Asia Cup 2023 Babar Azam : బాబర్‌ అజామ్ సంచలనం.. కోహ్లీ రెండు వరల్డ్​ రికార్డ్స్​ బ్రేక్​!

Asia Cup 2023 Babar Azam : ఆసియా కప్​ 2023 మొదలైపోయింది. తొలి మ్యాచ్​లో పాకిస్థాన్-నేపాల్​ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్​లో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్ అద్భుతంగా రాణించాడు. మరోసారి తన సత్తాను ప్రపంచానికి చూపించాడు. విధ్వంసకర సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న బాబర్‌.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ శతకం.. బాబర్​కు తన కెరీర్​లో 19వ వన్డే సెంచరీ. అలానే ఈ మ్యాచ్‌లో తన అద్భుత ఇన్నింగ్స్​తో అతడు.. పలు అరుదైన రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. అలానే వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

Asia Cup 2023 Nepal VS Pakistan : బాబర్‌ సాధించిన రికార్డులు ఇవే.. వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా బాబర్‌ ఘనతను అందుకున్నాడు. ఈ మార్క్​ను బాబర్​ కేవలం 102 ఇన్నింగ్స్‌లోనే సాధించాడు. అంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా లెజెండ్‌ హషీమ్‌ ఆమ్లా, విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. ఆమ్లా 104 ఇన్నింగ్స్‌లలో సాధించగా.. విరాట్​ 124 ఇన్నింగ్స్​లో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరిని రికార్డును బాబర్‌ ఆజమ్ అధిగమించాడు.

ఆసియాకప్‌ హిస్టరీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన కెప్టెన్‌గా బాబర్‌ మరో రికార్డును కూడా అధిగమించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్‌, స్టార్‌ ప్లేయర్​ విరాట్‌ కోహ్లీ(136) పేరిట ఉండేది. కానీ తాజా మ్యాచ్‌లో అడామ్​ 151 పరుగులు చేసి.. విరాట్​ రికార్డును బ్రేక్ చేశాడు.

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమ్​ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్​ గంభీర్‌(5238), ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మార్టిన్​ను(5346) ఇప్పటివరకు ముందుకున్నారు. ఇప్పుడు దాన్ని కూడా బాబర్‌ అధిగమించేశాడు. ఇప్పటివరకు 102 ఇన్నింగ్స్‌లలో అతడు 5353 పరుగులు సాధించాడు.

Asia Cup 2023 IND VS PAK Match Date : ఇకపోతే ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై పాకిస్థాన్భారీ విజయం సాధించింది. 238 పరుగుల తేడాతో గెలిచింది. ఇక పాక్ తమ రెండో మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 2న టీమ్​ఇండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్​ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పోరుకు వర్షం ముప్పు ఉందని అంటున్నారు.

Asia Cup 2023 Pak vs Nepal : నేపాల్​పై పాక్​ పంజా.. భారీ తేడాతో బంపర్ విక్టరి

Ind Vs Pak Asia Cup 2023 : క్రికెట్​ లవర్స్​కు షాకింగ్​ న్యూస్​.. సెప్టెంబర్​ 2 భారత్​ - పాక్​ మ్యాచ్​ లేనట్టేనా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.