ETV Bharat / sports

Ashes 3rd Test:  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తుదిజట్లు ఇవే

author img

By

Published : Dec 25, 2021, 10:35 AM IST

Ashes 3rd Test: యాషెస్ సిరీస్ మూడో టెస్టు మెల్​బోర్న్ వేదికగా ఆదివారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్ తుదిజట్లను ప్రకటించాయి.

Ashes 2021 australia squad, Ashes 2021 england squad, యాషెస్ మూడో టెస్టు ఆస్ట్రేలియా జట్టు, యాషెస్ మూడో టెస్టు ఇంగ్లాండ్ జట్టు
Ashes 2021

Ashes 3rd Test: యాషెస్ సిరీస్​లో ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి జోరుమీదుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండు ఓటములతో నిరాశలో కూరుకుపోయింది ఇంగ్లాండ్. ఇక ఈ రెండు జట్లు ముచ్చటగా మూడో పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మెల్​బోర్న్ వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు వారి తుదిజట్లను ప్రకటించాయి.

నాలుగు మార్పులతో ఇంగ్లాండ్

తొలి రెండు మ్యాచ్​ల్లోనూ ఓటమితో ఒత్తిడిలో పడిపోయింది ఇంగ్లాండ్ జట్టు. దీంతో ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. ఈ క్రమంలోనే జట్టులో కీలక మార్పులు చేసింది. ఫామ్​లేమితో సతమతమవుతున్న ఓపెనర్ రోరీ బర్న్స్​తో పాటు ఒల్లీ పోప్​కు మొండిచేయి చూపింది. దీంతో స్టార్ ఓపెనర్ బెయిర్ స్టోతో జట్టులోకి వచ్చాడు. అలాగే స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్​ను తుదిజట్టులోకి తీసుకోలేదు.

ఇంగ్లాండ్ జట్టు

England Squad: హసీబ్ హమీద్, జాక్ క్రాలే, డేవిడ్ మలన్, రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, బెయిర్​స్టో, బట్లర్, మార్క్ వుడ్, ఒల్లీ రాబిన్సన్, జాక్ లీచ్, అండర్సన్

కమిన్స్ వచ్చాడు..

కరోనా వచ్చిన వ్యక్తికి దగ్గరగా ఉన్న కారణంగా అడిలైడ్ టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే యువ పేసర్ స్కాట్ బోలాండ్​ ఈ మ్యాచ్​తో టెస్టు అరంగేట్రం చేయబోతున్నాడు. రెండో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న జే రిచర్డ్​సన్​కు తుదిజట్టులో చోటు దక్కలేదు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం వల్ల హేజిల్​వుడ్ ఈ మ్యాచ్​కూ అందుబాటులో ఉండట్లేదు.

ఆస్ట్రేలియా జట్టు

Australia Squad: వార్నర్, మార్కస్ హారిస్, లబుషేన్, స్మిత్, హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారే, కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథల్ లియోన్, స్కాట్ బోలాండ్.

ఇవీ చూడండి: హార్దిక్ కండలు పెంచాల్సిందే.. లేదంటే కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.