ETV Bharat / sports

టీమ్​ఇండియా ఫీల్డింగ్​ కోచ్​ రేసులో అభయ్

author img

By

Published : Oct 29, 2021, 8:46 PM IST

టీమ్​ఇండియా ఫీల్డింగ్​ కోచ్ బాధ్యతలు స్వీకరించేందుకు మాజీ క్రికెటర్ అభయ్​ శర్మ(abhay sharma fielding coach) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి దరఖాస్తు కూడా సమర్పించాడీ మాజీ క్రికెటర్.

abhay sharma
అభయ్ శర్మ

భారత్-ఎ, అండర్-19, జాతీయ మహిళా క్రికెట్ జట్టుతో పనిచేసిన మాజీ క్రికెటర్ అభయ్ శర్మ(abhay sharma fielding coach).. టీమ్​ఇండియా పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్​ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మేరకు బీసీసీఐకి అతడు దరఖాస్తు చేసుకున్నాడని ఓ అధికారి స్పష్టం చేశారు.

నవంబర్ 3న దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. ఈ నేపథ్యంలో అభయ్​.. ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించాడు. ప్రధాన కోచ్​ పదవి బరిలో ఉన్న దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్​తో(Rahul Dravid as coach) కలిసి పనిచేసిన అనుభవం అభయ్​కి ఉంది. ఇండియా ఏ, అండర్ 19 జట్లకు ద్రవిడ్ కోచ్​గా పనిచేసినప్పుడు అభయ్​ ఆ జట్లకు సేవలందించాడు.

అభయ్.. దిల్లీ, రైల్వేస్, రాజస్థాన్ జట్ల తరఫున 89 ఫస్ట్ క్లాస్ మ్యాచ్​లు ఆడాడు. 2016లో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్​గా జింబాబ్వేకు వెళ్లాడు. అదే ఏడాది భారత జట్టు అమెరికా, వెస్టిండీస్​ పర్యటనల్లోనూ అభయ్ పాలుపంచుకున్నాడు.

మరోవైపు ఇండియా ఏ కోచ్ పరాస్ మాంబ్రే కూడా టీమ్​ఇండియా సీనియర్​ జట్టు బౌలింగ్ బాధ్యలకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి:

పురుషుల జట్టుకు మహిళా కోచ్.. చరిత్రలో తొలిసారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.