ETV Bharat / sports

డివిలియర్స్​ రిటైర్మెంట్​ షాకింగ్​ ముచ్చట - రెటీనా లేని కంటితో రెండేళ్ల బ్యాటింగ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 8:24 PM IST

Updated : Dec 7, 2023, 9:02 PM IST

AB De Villiers Eye Surgery
AB De Villiers Eye Surgery

AB De Villiers Eye Surgery : సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన కెరీర్​చివర్లో కంటి చూపు సమస్యతో బాధపడినట్లు చెప్పాడు. ముఖ్యంగా ఆఖరి రెండేళ్లు కంట్లో రెటినా లేకుండానే క్రికెట్ ఆడినట్లు తెలిపాడు.

AB De Villiers Eye Surgery : సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తన రిటైర్మెట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. అయితే 2018లోనే అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పిన డివిలియర్స్​, 2021 వరకూ ఆయా డొమెస్టిక్ లీగ్​ల్లో ఆడాడు. ముఖ్యంగా ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు తరఫున డివిలియర్స్, జట్టుకు అనేక విజయాలు అందించాడు.

రీసెంట్​గా 'విస్​డెన్ క్రికెట్ 'అనే మ్యాగజెన్​ ఇంటర్వ్యూలో పాల్గొన్న డివిలియర్స్, షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అతడు రిటైర్మెంట్ ప్రకటించక ముందు కంటిచూపు సమస్యతో బాధపడినట్లు తెలిపాడు. తన కెరీర్​లో చివరి రెండేళ్లు రెటినా లేని (డిటాచ్​ రెటీనా) కంటితోనే క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. "మా కుమారుడు తన మోకాలితో పొరపాటున నా కుడి కన్నుపై తన్నాడు. అప్పటి నుంచి నా కంటి చూపు మందగించింది. అయితే సర్జరీ అనంతరం 'నువ్వు క్రికెట్ ఎలా ఆడావు?' అని డాక్టర్లు అడిగారు. అయితే నా ఎడమ కన్ను స్పష్టంగా కనిపించడం వల్ల క్రికెట్ ఆడడం సాధ్యమైంది" అని డివిలియర్స్ అన్నాడు.

AB De Villiers IPL Stats : అయితే చివరి రెండేళ్ల కెరీర్​లో డివిలియర్స్ కంటి సమస్యతోనే 2020, 2021 ఎడిషన్​ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)​ ఆడాడు అన్నమాట. ఈ రెండు ఎడిషన్​లలో వరుసగా 454, 313 పరుగులతో రాణించాడు. చివరి రెండు ఎడిషన్​ ఐపీఎల్​లో డివిలియర్స్ ఏకంగా 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక ఓవరాల్​గా ఐపీఎల్​లో 184 మ్యాచ్​లు ఆడిన డివిలియర్స్, 5,162 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

AB De Villiers International Stats : అంతర్జాతీయ క్రికెట్​లో ఏబీ డివిలియర్స్ 114 టెస్టులు, 228 వన్డే, 75 టీ20 మ్యాచ్​లు ఆడాడు. టెస్టుల్లో 8765 పరుగులు (22 సెంచరీలు), వన్డేల్లో 9577 పరుగులు (25 సెంచరీలు), టీ20ల్లో 135.17 స్ట్రైక్ రేట్​తో 1672 పరుగులు బాదాడు.

AB de villiers vs Kohli : 'కోహ్లీ-సూర్యతో తలపడాలని ఉంది'

ధోనీ-డివిలియర్స్​.. కోహ్లీ ఫేవరెట్​ క్రికెటర్​ ఎవరో తెలుసా?

Last Updated :Dec 7, 2023, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.