ETV Bharat / sports

2024లో టోర్నీలే టోర్నీలు- క్రికెట్​ ఫ్యాన్స్​కు ఫుల్ పండుగ- కంప్లీట్ ఇయర్ షెడ్యూల్ ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 10:28 AM IST

2024 Cricket Tournament Schedule : 2023కి గుడ్​బై చెప్పేసి 2024లోకి ప్రపంచమంతా అడుగుపెట్టేసింది. ఇక ఈ కొత్త సంవత్సరంలో టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ మెగా టోర్నీతోపాటు మరో ఐదు టోర్నమెంట్​లు జరగనున్నాయి. ఎప్పుడెప్పుడు ఏ మ్యాచ్​లు జరగనున్నాయో తెలుసుకుందాం.

2024 Cricket Tournament Schedule
2024 Cricket Tournament Schedule

2024 Cricket Tournament Schedule : కొత్త సంవత్సరం వచ్చేసింది. ఏడాది పాటు జరిగే మ్యాచ్​లు, టోర్నీలు, టూర్లపై ముందస్తుగానే షెడ్యూల్ ఖరారైంది. గతేడాది వన్డే క్రికెట్ ప్రపంచ కప్ జరగ్గా, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇక ఐపీఎల్ 17వ సీజన్ ఎలాగూ వేసవిలో మస్తు మజాను అందించనుంది. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, యాషెస్ సిరీస్, భారత్​లో పర్యటించనున్న విదేశీ జట్లతో ఏడాదంతా క్రికెట్ పండగే. దాదాపు ఏడాదిలో అన్ని నెలలు కవర్ అయ్యేలా షెడ్యూల్ ఖరారు చేశాయి ఆయా క్రికెట్ బోర్డులు.

భారత్ పర్యటనకు వస్తున్న ఇంగ్లాండ్
ఈ నెల 25 నుంచి రెండు నెలల పాటు మన దేశంలో పర్యటించనుంది ఇంగ్లాండ్. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ నెల 25 నుంచి మార్చి 11 వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందుకోసం హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్ కోట్, రాంచీ, ధర్మాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ కప్ పరాభావం తర్వాత తొలిసారిగా భారత్ వస్తోంది ఇంగ్లాండ్ జట్టు. టెస్టుల్లో ఇరు జట్ల మధ్య ఆసక్తికరమైన పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. రెండు జట్లు టాప్ ఆర్డర్ బలంగా ఉండటం, ఐదు రోజుల పాటు జరిగే సుదీర్ఘ మ్యాచ్లు వీక్షించే చాన్స్ మన తెలుగు ప్రేక్షకులకు లభించడం లక్కీఅనే చెప్పాలి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024
మార్చిలో ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ముగియగానే క్రికెట్ ప్రేమికులను అమితంగా ఆకర్షించే పొట్టి క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ తేదీలను ఇంకా ప్రకటించకపోయినా ఏటా జరిగే ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే ఈసారి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో దాదాపు 10 జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు 16 సీజన్లు దిగ్విజయంగా ముగియగా, ఈ ఏడాది 17వ సీజన్ టోర్నీ జరగనుంది. ఇందుకోసం దేశ, విదేశీ క్రీడాకారుల వేలం ఇప్పటికే పూర్తయింది. ఇక ఈ మెగా టోర్నీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)
ఐపీఎల్ మాదిరిగానే మహిళ క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. ఈ టోర్నీ రెండో సీజన్​కు ఈ ఏడాది ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే మన మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ టోర్నీల్లో రాణిస్తుండటంతో ఈ లీగ్ చూసేందుకు అభిమానులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ టోర్నీలో ఐదు జట్లు తలపడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ టీమ్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్​లో తలపడుతున్నాయి. ఈ టోర్నీ తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024
ఈ ఏడాది జరిగే అతిపెద్ద క్రికెట్ టోర్నీల్లో టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఒకటి. ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ నిర్వహించే అతిపెద్ద టోర్నీ టీ20 వరల్డ్ కప్ పోటీలే. పొట్టి క్రికెట్ ఫార్మట్ ఇంతలా ఆకట్టుకోడానికి కూడా టీ20 ప్రపంచ్ కప్ ఎంతో దోహదపడింది. గత ఏడాది మన దేశంలో వన్డే ప్రపంచ కప్ జరగ్గా, ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, అమెరికా దేశాల్లో జరగనుంది. 2023లో ఫైనల్స్ వరకు పోరాడిన భారత్, హాట్ ఫేవరెట్​గా బరిలో దిగి అత్యంత ఘోరంగా ఇంటిబాట పట్టిన ఇంగ్లాండ్, వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ పైనా కన్నేశాయి. హోరాహోరీగా జరిగే ఈ టోర్నీలో విజేతగా ఎవరు నిలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

న్యూజిలాండ్ పర్యటనలో ఆస్ట్రేలియా
ఇక ద్వైపాక్షిక సిరీస్ విషయానికి వస్తే ఈ ఏడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరిగే టోర్నీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య పోటీని అభిమానులు నరాలు తెగే ఉత్కంఠ మధ్య వీక్షిస్తుంటారు. అందుకే ఈ రెండు జట్లు పరస్పరం తలపడుతాయంటే, క్రికెట్ ప్రేమికులకు ఆ రోజు పండగే. ఎంతో ఉత్కంఠ రేపే మ్యాచ్లను వీక్షించాలంటే తప్పకుండా ఈ రెండు టీమ్స్ మ్యాచులను చూడాల్సిందే. ఇక న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ఆ దేశంలో మూడు టీ20లతోపాటు, రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది.

ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న ఆస్ట్రేలియా
ఇక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ దేశంలో పర్యటించనుంది ఆస్ట్రేలియా. ఇరు దేశాల మధ్య ఏటా యాషెస్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇరు జట్ల ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ సిరీస్ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనుంది. గత ఏడాది డ్రాగా ముగిసిన ఈ సిరీస్ ను ఈ ఏడాది ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఇరుజట్లు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సెప్టెంబర్ 11 నుంచి 29 వరకు జరిగే యాషెస్ సిరీస్ ఆ నెల రోజులూ క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని పంచనుంది.

మనదేశంలో పర్యటించనున్న ఆస్ట్రేలియా
ఈ ఏడాది చివర్లో మన దేశంలో పర్యటించనుంది ఆస్ట్రేలియా. ప్రపంచ కప్​లో చాంపియన్​గా నిలిచి భారత్ ఆశలపై నీళ్లు జల్లిన ఆసీస్ ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్​లో పర్యటించనుంది. 2020-21 టెస్టు సిరీస్ విజయాలను పునరావృత్తం చేయాలనే భావిస్తోంది టీమ్​ఇండియా. సమజ్జీవులు అయిన ఈ రెండు జట్ల టెస్టు సిరీస్​తో 2024 ముగియనుంది. ఈ క్రికెట్ క్యాలెండర్ పరిశీలిస్తే ఏడాదంతా క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదం లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.