ETV Bharat / sports

ఇండోనేసియా ఓపెన్​: సెమీస్ చేరిన సింధు

author img

By

Published : Jul 19, 2019, 7:49 PM IST

భారత టాప్​ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్​ సెమీఫైనల్లో ప్రవేశించింది. జపాన్​కు చెందిన నయోమి ఒకుహరను క్వార్టర్స్​లో ఓడించి మహిళల సింగిల్స్​ టైటిల్​ రేసులో ముందడుగు వేసింది.

ఇండోనేషియా ఓపెన్​: సెమీస్ చేరిన సింధు

ఇండోనేసియా ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో నయోమి ఒకుహర(జపాన్‌)పై విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు 21-14, 21-7 తేడాతో మూడో సీడ్​ను వరుస సెట్లలో ఓడించింది. 44 నిమిషాల పాటు ఈ పోరు హోరాహోరీగా సాగింది.

Indonesia Open  P V Sindhu
ఇండోనేషియా ఓపెన్​: సెమీస్ చేరిన సింధు

ఆరంభం నుంచే జపాన్​ క్రీడాకారిణిపై ఆధిపత్యం ప్రదర్శించిన భారత ఒలింపిక్​ పతక విజేత... తొలి సెట్‌లో 6-6 తేడాతో కొంత పోటీ ఎదుర్కొంది. అనంతరం వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 10-6తో దూసుకెళ్లింది. చివరికి 21-14 తేడాతో తొలి సెట్​​ కైవసం చేసుకుంది తెలుగు ప్లేయర్​​.

రెండో రౌండ్​లో సింధు జోరుకు ప్రత్యర్థి నుంచి సమాధానం కరవైంది. తనకన్నా మెరుగైన ర్యాంకులో ఉన్న ఒకుహరపై తనదైన స్మాష్​లతో విరుచుకుపడింది. చివరికి 21-7తో సెట్​ గెలుచుకొని సెమీఫైనల్లో అడుగుపెట్టిందీ భారత షట్లర్​​.

రెండో సీడ్​ చెన్​ యు ఫీ(చైనా)తో తర్వాతి మ్యాచ్​లో తలపడనుంది సింధు. వీరిద్దరూ బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ సూపర్​-1000 టోర్నీలో నాలుగోసారి అమీతుమీ తేల్చుకోనున్నారు.

Sindhu beats Okuhara to storm into Indonesia Open semifinals
చెన్​ యు ఫీ(చైనా)X సింధు

ఇవీ చూడండి...ఇంగ్లాండ్​ కౌంటీల్లో దుమ్మురేపిన డివిలియర్స్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Singapore National Stadium, Singapore - 19th July 2019
1. 00:00 Various of Manchester United players training and warming up
2. 00:30 Various of Paul Pogba in training
3. 01:06 Various of Ole Gunnar Solskjaer
SOURCE: SNTV
DURATION: 01:43
STORYLINE:
Manchester United manager Ole Gunnar Solskjaer shared his thoughts ahead of the International Champions Cup on Friday.
He said Romelu Lukaku is unfit to play against Inter Milan, the club he is speculated to join, but remains a Manchester United player as of now.
Ole Gunnar also thinks the next season of the Premier League will be a "closer race" and there won't be a repeat of the dominance of Liverpool and Manchester City.
Manchester United will play Inter Milan on Saturday(20th July).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.