ETV Bharat / sitara

ఈటీవీలో యాక్షన్ ఎంటర్​టైనర్​ 'గుణ 369'

author img

By

Published : Oct 18, 2020, 11:31 AM IST

Updated : Oct 18, 2020, 11:49 AM IST

Guna 369 World Television Premier today 6 PM on Etv telugu
ఈటీవీలో యాక్షన్ ఎంటర్​టైనర్​ 'గుణ 369'

యువ కథానాయకుడు కార్తికేయ నటించిన 'గుణ 369'.. బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఎంటర్​టైన్​మెంట్ ఛానెల్​ ఈటీవీలో ఈరోజు(ఆదివారం) సాయంత్రం ప్రసారం కానుంది.

ఎమోషనల్ యాక్షన్ ఎంటర్​టైనర్ 'గుణ 369'.. ఆదివారం(అక్టోబరు 18) సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. హీరో కార్తికేయ, ఇందులో తన చక్కని నటనతో ఆకట్టుకున్నారు. వీటిలో సినిమా గురించిన మరిన్ని సంగతులు మీకోసం.

"మన వల్ల పక్కవాడి జీవితానికి ఏ హాని జరగకూడదు.. ఒకవేళ జరిగింది అంటే అది పొరపాటు కాదు నేరం. పొరపాటును క్షమించొచ్చు కాని నేరాన్ని శిక్షించాల్సిందే", "గొడవపడితే మిగిలేది ఏం ఉండదు ఒక్క గొడవ తప్ప" డైలాగ్​లు సినిమా కథాంశాన్ని తెలియజేస్తున్నాయి.

karthikeya anagha
గుణ 369 సినిమాలో కార్తికేయ, అనఘ

కథేంటి?

ఒంగోలులో ఉండే సాదాసీదా కుర్రాడు గుణ(కార్తికేయ). తన చెల్లినిచ్చి పెళ్లి చేయాలనుకున్న వ్యక్తిని కాపాడాలని ప్రయత్నించి సమస్యల్లో చిక్కుకుంటాడు. అనుకోకుండా విలన్​ను చంపి జైలుకు కూడా వెళ్తాడు. విడుదలైన బయటకొచ్చేటప్పటికి తన చెల్లి చనిపోయి ఉంటుంది. ఇంతకీ అసలేం జరిగింది? ఆమె చనిపోవడానికి కారణమేంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇందులో కార్తికేయ సరసన అనఘ హీరోయిన్​గా నటించింది. నరేశ్, హేమ, 'రంగస్థలం' మహేశ్ తదితరులు ఇతరపాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన 'బుజ్జి బంగారం' పాట అయితే ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బోయపాటి శ్రీను దగ్గర శిష్యరికం చేసి ఈ సినిమాతో దర్శకుడిగా మారారు అర్జున్ జంధ్యాల. ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాలను గురువులానే తీర్చిదిద్దడంలో సఫలమయ్యారు. ఇన్ని విశేషాలున్న 'గుణ 369' ఆలస్యం చేయకుండా చూసేయండి మరి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి:

Last Updated :Oct 18, 2020, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.