ETV Bharat / sitara

రష్మి, సుడిగాలి సుధీర్​ కంటతడి.. ఏమైందంటే?

author img

By

Published : Aug 14, 2021, 10:15 AM IST

jabardast
జబర్దస్త్​

ఎప్పుడూ సరదాగా ఉండే రష్మి, సుధీర్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తమ మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.

ఈ వారం 'ఎక్స్​ట్రా జబర్దస్త్'(Extra Jabardast Latest Promo) అదిరిపోయింది. 'వకీల్​సాబ్​'గా​ రాకింగ్​ రాకేశ్​ తన హీరోయిజాన్ని చూపిస్తూనే కడుపుబ్బా నవ్వించాడు. బల్లాలదేవగా ఇమ్మాన్యుయెల్​, కట్టప్పగా సుడిగాలి సుధీర్​.. 'బాహుబలి' భాస్కర్​తో కలిసి చేసిన కామెడీ నవ్వులు పూయించాయి.

యూట్యూబ్​ స్టార్స్​ నెల్లూరు కుర్రోళ్లు ఈ ఎపిసోడ్​లో సందడి చేశారు. ఆ తర్వాత గెటప్​ శ్రీను, హైపర్​ ఆది, సుధీర్​ కలిసి కితకితలు పెట్టించారు. మొత్తంగా నవ్వుల పండగగా సాగిన ఈ కార్యక్రమం చివర్లో కంటెస్టెంట్​లు కన్నీరు పెట్టుకున్నారు. తమ నిజజీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఎదురైన అందమైన అనుభూతులను పంచుకున్నారు. ఇందులో భాగంగా సుధీర్, రష్మి తామిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రోమోనూ మీరూ చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: సుధీర్-రాంప్రసాద్ పంచులు.. పడిపడి నవ్విన ఇంద్రజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.