ETV Bharat / sitara

'స్కామ్​ 1992'కు 'ఫిలింఫేర్' ఎందుకు రాలేదంటే!

author img

By

Published : Dec 21, 2020, 2:35 PM IST

'స్కామ్​ 1992'.. ఈ ఏడాది విడుదలైన ఈ వెబ్​సిరీస్​కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసిన దీని గురించే చర్చ కొనసాగుతోంది. అయితే.. ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్​ ఓటీటీ అవార్డుల్లో ఈ సిరీస్​కు ఒక్క అవార్డు కూడా రాకపోవడం అభిమానులకు అసంతృప్తిని మిగిల్చింది. తాజాగా ఈ సిరీస్​కు 'ఫిలింఫేర్​'లో చోటు దక్కకపోవడానకి కారణమేంటో చెప్పారు దర్శకుడు హన్సల్ మెహతా.

why scam 1992 web series is did not got award in ott film fare awards its directot hansal mehta given clarity
'స్కామ్​ 1992'కు 'బ్లాక్​లేడీ' ఎందుకు రాలేదంటే..

ఈ ఏడాది విడుదలైన వెబ్​సిరీస్​ల్లో 'స్కామ్​ 1992' సంచలన విజయం సాధించింది. ఐఎమ్​డీబీ రేటింగ్స్​లోనూ ఈ సిరీస్​ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. దీని​వల్లే సోనీ లివ్​ ఓటీటీ సబ్​స్క్రైబర్లు అమాంతం పెరిగిపోయారు. అయితే.. ఇటీవల జరిగిన 'ఫిలింఫేర్​ ఓటీటీ అవార్డుల్లో ఈ సిరీస్​కు ఒక్క పురస్కారం కూడా దక్కకపోవడం అభిమానులను అసహనానికి గురిచేసింది. 'నిజమైన ప్రతిభను గుర్తించడంలో ఫిలింఫేర్​ మరోసారి విఫలమైంది' అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా ఈ సిరీస్​ దర్శకుడు హన్సల్​ మెహతా వివరణ ఇచ్చారు.

"ఈ ఏడాది ఫిలింఫేర్​ ఓటీటీ అవార్డ్స్​ కట్​ ఆఫ్​ తేదీ తర్వాత.. మా సిరీస్​ విడుదలైంది. అందుకే నామినేషన్​కు అర్హత సాధించలేకపోయింది. మీ వద్ద నుంచి అందుతున్న ప్రేమే మాకు అతిపెద్ద పురస్కారం."

- హన్సల్ మెహతా, 'స్కామ్​ 1992' వెబ్​సిరీస్ దర్శకుడు.

స్టాక్​ బ్రోకర్​ హర్షద్​ మెహతా.. స్టాక్​ మార్కెట్​ను ఉన్నతస్థాయికి ఏ విధంగా తీసుకెళ్లాడు. అనంతర కాలంలో జరిగిన అతడి పతనమే ఈ స్కామ్​ 1992 వెబ్​ సిరీస్ కథాంశం​. హర్షద్​ జీవితానికి సంబంధించిన అంశాలను చూపించడంలో దర్శకుడు హన్సల్​ మెహతా విజయం సాధించారు. హర్షద్​ మెహతా పాత్ర పోషించిన ప్రతీక్​ గాంధీ.. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారు.

ఇదీ చూడండి:తొలిసారి ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.