ETV Bharat / sitara

ఆలియా చెప్పిన ప్రియమైన వ్యక్తి ఎవరు?

author img

By

Published : May 18, 2020, 9:19 AM IST

ఇంట్లోనే హెయిర్​కట్​ చేసిన తన ప్రియమైన వ్యక్తికి ఇన్​స్టాగ్రామ్​లో ధన్యవాదాలు తెలిపింది బాలీవుడ్​ నటి ఆలియా భట్​. అయితే తనకు జత్తు కత్తిరించింది ఎవరనేది స్పష్టత ఇవ్వలేదు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.

Who was the beloved one that Alia Bhatt said?
ఆలియా భట్​ చెప్పిన ప్రియమైన వ్యక్తి ఎవరు?

లాక్‌డౌన్‌ వేళ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరికీ జుత్తు కత్తిరించుకోవడం ఓ పెద్ద ప్రహసనంగా మారింది. కొంతమంది తారలు తమ కుటుంబ సభ్యుల సాయంతో హెయిర్‌ కట్‌ చేసుకుంటూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఆలియా భట్‌.. ఇటీవల జుత్తు కత్తిరించుకుందట. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పొట్టి జుత్తుతో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది. అయితే తనకు జుత్తు కత్తిరించింది ఎవరన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది ఆలియా.

Who was the beloved one that Alia Bhatt said?
ఆలియా భట్​ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసిన ఫొటో

"ఇంట్లోనే హెయిర్‌ కట్ చేసుకున్నా. ఆ విషయంలో నాకు సహకరించిన నా ప్రియమైన బహుముఖ ప్రజ్ఞాశాలికి ధన్యవాదాలు" అని ఆలియా రాసిన వ్యాఖ్య అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఆ ప్రియమైన వ్యక్తి ఎవరో అంటూ కామెంట్లలో ఆరా తీస్తున్నారు. అది కచ్చితంగా ఆలియా ప్రియుడు రణ్‌బీర్‌ కపూరే అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌లో కసరత్తులతో మరింత ఫిట్‌గా మారానని చెబుతోంది ఆలియా.

ఇదీ చూడండి.. స్క్రిప్ట్​ రెడీ.. షూటింగ్​ చేయడమే ఆలస్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.