ETV Bharat / sitara

'కరోనా అంతమైన తర్వాత ఈ చిన్నారిలా గెంతుతా'

author img

By

Published : Apr 11, 2020, 11:42 AM IST

ఓ బుడతడి వీడియోను పోస్ట్​ చేసిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. కరోనా నిర్మూలన జరిగిన తర్వాత ఈ చిన్నారిలా డ్యాన్స్ చేస్తానని చెప్పాడు.

Watch! Varun is ready to celebrate end of COVID-19 pandemic
వరుణ్​ ధావన్​

కరోనా మహమ్మారి వల్ల ప్రస్తుతం అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనికి వ్యాక్సిన్​ కనిపెట్టేందుకు ఇప్పటికే పరిశోధకులు చాలా శ్రమిస్తున్నారు. అయితే ఈ వైరస్ త్వరగా అంతం కావాలని కోరిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. అది జరిగిన తర్వాత తాను ఇలానే డ్యాన్స్ చేస్తానంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

ఇందులో ఓ బుడతడు ఆనందంతో మెలికలు తిరుగుతూ ఫన్నీగా డాన్స్​ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియోపై పలువురు సెలబ్రిటీలు కామెంట్ చేస్తున్నారు. తామూ వరుణ్​తో కలిసి గెంతుతామని రాసుకొచ్చారు.

దేశంలోని యువ ప్రతి​భను బయటకు తీసేందుకు ఓ సరికొత్త ప్లాన్ సిద్ధం చేశాడు వరుణ్. ఆన్​లైన్ వేదికగా 'ఎంటర్​టైన్​మెంట్ నం.1' అనే​ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇలాంటి వాటిని వీక్షించి, లాక్​డౌన్ సమయాన్ని నెటిజన్లు సద్వినియోగం చేసుకోవచ్చని అన్నాడు.

ఇదీ చదవండిః 'పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్​ చేస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.