ETV Bharat / sitara

'బీస్ట్'​ సెకండ్​ సింగిల్​.. 'భీమ్లానాయక్​' హాట్​స్టార్​ ట్రైలర్​

author img

By

Published : Mar 19, 2022, 7:21 PM IST

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో టాలీవుడ్​ స్టార్​ పవన్​కల్యాణ్​​, కోలీవుడ్​ స్టార్​ విజయ్​ సినిమా సంగతులు ఉన్నాయి.

bheemlanayk
భీమ్లానాయక్​

Vijay Beast second song: తమిళ స్టార్ హీరో విజయ్​ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా 'బీస్ట్‌'. పూజా హెగ్డే హీరోయిన్​. నెల్సన్‌ దిలీప్​కుమార్​ దర్శకుడు. వచ్చే నెలలో విడుదల కానుందీ చిత్రం. ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని 'అరబిక్​ కుతు' సాంగ్​ ఎంతగా హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా శ్రోతలను ఊర్రూతలూగించింది. సోషల్​మీడియాలో రికార్డులు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో సాంగ్​ విడుదలైంది. 'జాలీ ఓ జిమ్ఖానా' అంటూ సాగే ఈ సాంగ్​ను హీరో విజయ్​ స్వయంగా ఆలపించడం విశేషం.అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'భీమ్లానాయక్'​ హాట్​స్టార్​ ట్రైలర్​

Bheemlanayak hotstar trailer: పవన్‌కల్యాణ్‌, రానా కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'భీమ్లా నాయక్‌'. ఇటీవలే థియేటర్లలో తుఫాన్ సృష్టించిన ఈ మూవీ మరో వారం రోజుల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్​ కానుంది. ఈ నేపథ్యంలోనే హాట్​స్టార్​ కొత్త ట్రైలర్​ను విడుదల చేసింది. ఈ వీడియో పవన్​-రానా పవర్​ఫుల్​ పంచ్​ డైలాగ్​లతో అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మాస్‌ ట్రైలర్‌ మీరూ చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రౌడీబాయ్స్​ అదరగొడుతోందిగా

Rowdyboys OTT records: ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం 'రౌడీబాయ్స్​'. శ్రీహ‌ర్ష కొనుగంటి తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ సినిమాతోనే ప్ర‌ముఖ నిర్మాత శిరీష్ త‌న‌యుడు ఆశిష్ హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్​గా విడుదలైన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. జీ5లో రిలీజ్​ అయిన ఈ సినిమా ప్రస్తుతం పదికోట్లకు పైగా మినిట్స్​ స్ట్రీమింగ్​ అయింది. ఇక ఈ మూవీలో శశిదేవ్‌ విక్రమ్‌, కార్తిక్‌ రత్నం కీలక పాత్రల్లో నటించగా.. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. మది ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ముద్దుగుమ్మల హాట్​ లుక్స్​ చూస్తే ఆగరంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.