ETV Bharat / sitara

Venkatesh birthday: అభిమానులు అందరూ మెచ్చే హీరో వెంకీమామ

author img

By

Published : Dec 13, 2021, 5:30 AM IST

ఫ్యాన్స్ అందరూ ముద్దుగా పిలుచుకునే వెంకీమామ బర్త్​డే ఈరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మీకోసం.

venkatesh birthday
వెంకటేశ్

venkatesh birthday: తెలుగులో మీరు ఏ హీరోకైనా అభిమాని అయ్యిండొచ్చు కానీ ఫ్యాన్స్ అందరూ​ మెచ్చే ఏకైక హీరో విక్టరీ వెంకటేశ్. ఈ మాట చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి వెంకీమామ పుట్టినరోజున ఆయన గురించి తెలుసుకోకపోతే ఏం బాగుంటుంది. అందుకే వెంకీ గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.

*35 ఏళ్ల కెరీర్​లో 74 సినిమాలు చేశారు విక్టరీ వెంకటేశ్.

*ఈ డిసెంబరు 13న వెంకటేశ్ 62వ వసంతంలోకి అడుగుపెట్టారు.

*వెంకటేశ్ తండ్రి రామానాయుడు ఓ ప్రముఖ నిర్మాత.

*1971లో 'ప్రేమ్​నగర్' సినిమాతో వెంకటేశ్ బాలనటుడిగా అరంగేట్రం చేశారు.

venkatesh birthday
వెంకటేశ్

*1985లో వెంకటేశ్​ నీరజను వివాహం చేసుకున్నారు. హయవాహిని, ఆశ్రిత, భావన ముగ్గురు అమ్మాయిలు, అర్జున్‌ రామంత్‌ కుమారుడు.

*1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

*ఆ తర్వాత కాలంలో స్వర్ణకమలం, బ్రహ్మపుత్రుడు, ప్రేమ, బొబ్బిలిరాజా తదితర సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.

*'చంటి' లాంటి సినిమాతో తనలోని మరో యాంగిల్​ను ప్రేక్షకులకు చూపించారు. ఆ తర్వాత కూడా పలు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ఇప్పటికీ అభిమానుల్ని మెప్పిస్తూనే ఉన్నారు.

*టాలీవుడ్‌లో సౌందర్య, విక్టరీ వెంకటేశ్​ది అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటి. వీరిద్దరూ ఏడు సినిమాల్లో నటించగా ఆరు సినిమాలు విజయవంతమయ్యాయి.

*'ప్రేమించుకుందాం రా', 'ప్రేమతో రా', 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మల్లీశ్వరి' లాంటి రొమాంటిక్‌ సినిమాలు వెంకీ ఖాతాలో ఉన్నాయి.

*వెంకటేశ్​కు నంది పురస్కారాలు ఏకంగా ఏడుసార్లు వరించాయి. అలానే ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్ అవార్డులు అందుకున్నారు.

*ఇటీవల 'దృశ్యం 2' సినీ ప్రేమికుల్ని పలకరించిన వెంకటేశ్.. 'ఎఫ్ 3' షూటింగ్​తో బిజీగా ఉన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

venkatesh birthday
వెంకటేశ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.