ETV Bharat / sitara

RajiniKanth: ఈ నెల 19న యూఎస్​కు రజనీ

author img

By

Published : Jun 17, 2021, 8:48 PM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​(RajiniKanth) హెల్త్​ చెకప్​ కోసం యూఎస్​ వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. వైద్యం కోసం రజనీ కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించడం వల్ల శనివారం (జూన్​ 19)న రజనీ పయనం కానున్నారు.

Rajinikanth fly to the US for a medical check-up
RajiniKanth: ఈ నెల 19న యూఎస్​కు రజనీ

సూపర్​స్టార్​ రజనీకాంత్​ హెల్త్​ చెకప్​ కోసం శనివారం(జూన్​ 19) అమెరికాకు పయనం కానున్నారు. కరోనా సంక్షోభం దృష్ట్యా హెల్త్​ చెకప్​ కోసం యూఎస్​ వెళ్లేందుకు ఇటీవలే కేంద్రాన్ని కోరగా.. అందుకు ప్రభుత్వం అనుమతించింది.

కేవలం కొంతమంది కుటుంబసభ్యులతో ప్రత్యేక విమానంలో రజనీ యూఎస్ వెళ్లనున్నారు. ఈ విమానంలో 14 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుంది. రజనీ అల్లుడు, హీరో ధనుష్​ కూడా హాలీవుడ్​ చిత్రం 'ది గ్రే మ్యాన్'(The Grey Man) చిత్రీకరణ కోసం అమెరికాలోనే ఉన్నారు.

ఇదీ చూడండి.. యూఎస్​కు రజనీ.. కేంద్రం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.