ETV Bharat / sitara

విక్టరీ వెంకటేశ్​కు రేచీకటి.. దర్శకుడి కొత్త ప్లాన్!

author img

By

Published : Mar 17, 2021, 3:16 PM IST

డబ్బు వల్ల వచ్చే సమస్యల ఆధారంగా తీస్తున్న 'ఎఫ్​3' సినిమా కోసం వెంకటేశ్​ పాత్రను వినూత్నంగా డిజైన్ చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఇంతకీ అదెంటంటే?

Venkatesh's Comedy With Night Blindness in F3 movie
విక్టరీ వెంకటేశ్​కు రేచీకటి.. దర్శకుడి కొత్త ప్లాన్!

ఇప్పటివరకు ఎన్నో పాత్రలతో నవ్వించిన విక్టరీ వెంకటేశ్​.. ఇప్పుడు రేచీకటి సమస్యతో నవ్వులు పంచునున్నారట. అనిల్ రావిపూడి తీస్తున్న 'ఎఫ్3' సినిమాలో ఇలా కనిపించనున్నారని సమాచారం. వెంకీతో పాటు ఇందులోని ఇతర పాత్రల్ని ఎంతో వైవిధ్యంగా రూపొందించినట్లు తెలుస్తోంది.

'రాజా ది గ్రేట్​' చిత్రంలో రవితేజను అంధుడిగా చూపించి మెప్పించిన దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు వెంకటేశ్​తో మరోసారి ఆ తరహా ప్రయోగం చేయబోతున్నారట.

గతంలో బ్రహ్మనందం ఓ సినిమాలో రేచీకటి సమస్యతో బాధపడే పాత్రలో నటించగా, కొన్నేళ్ల క్రితం హాస్యనటుడు వెన్నెల కిశోర్.. 'ఆనందో బ్రహ్మా'లో ఇలాంటి పాత్ర పోషించి నవ్వులు పూయించారు.

వెంకటేశ్ ప్రస్తుతం 'నారప్ప', 'దృశ్యం 2' రీమేక్​లో నటిస్తున్నారు. మొత్తం ఈయన నటిస్తున్న మూడు చిత్రాలు ఇదే ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

venkatesh drishyam 2 miovie
దృశ్యం 2 రీమేక్ షూటింగ్​లో వెంకటేశ్
venkatesh narappa movie
నారప్ప సినిమాలో వెంకటేశ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.