ETV Bharat / sitara

పవన్​ ఫ్యాన్స్​​కు గుడ్​న్యూస్​.. ఏకంగా రెండు సర్​ప్రైజ్​లు!

author img

By

Published : Aug 26, 2021, 10:49 AM IST

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​(Pawan Kalyan) అభిమానుల కోసం రెండు సర్​ప్రైజ్​లు సిద్ధమయ్యాయి. సెప్టెంబరు 2న పవన్​ పుట్టినరోజు(Pawan Birthday) సందర్భంగా 'భీమ్లా నాయక్​'(Bheemla Nayak), 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) చిత్రాల నుంచి అప్​డేట్లు రానున్నట్లు తెలుస్తోంది.

Two Big Surprises For Pawan Kalyan's fans on his Birthday
పవన్​ ఫ్యాన్​కు గుడ్​న్యూస్​.. ఏకంగా రెండు సర్​ప్రైజ్​లు!

సినిమా హీరోల పుట్టినరోజు అంటే అభిమానుల్లో సందడి మాములుగా ఉండదు. అభిమానుల కేకు కట్టింగ్​లు, వేడుకలతో అదిరిపోతుంది. ఇక పవర్​స్టార్​ బర్త్​డే(Pawan Kalyan Birthday Celebrations) అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ఆఫ్​లైన్​లో కటౌట్ల నుంచి ఆన్​లైన్​లో బర్త్​డే ట్రెండ్​ల వరకు ఓ పండగ వాతావరణం కనిపిస్తుంది. అందుకోసమే ఈసారి పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​(Pawan Kalyan) పుట్టినరోజు(సెప్టెంబరు 2)న అభిమానులకు రెండు భారీ సర్​ప్రైజ్​లు రానున్నట్లు తెలుస్తోంది.

'వీరమల్లు' అప్​డేట్​..

పవన్​కల్యాణ్​ - క్రిష్​ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్​ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu). నిధి అగర్వాల్​(Nidhhi Agerwal) కథానాయిక. జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​(Jacqueline Fernandez) కీలకపాత్ర పోషిస్తుంది. ఏఎమ్​ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఎమ్​ఎమ్​ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. పవర్​స్టార్​ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న ఈ చిత్రం నుంచి కీలక అప్​డేట్​ రానుందని సమాచారం. దాంతో పాటు సినిమా రిలీజ్​ డేట్​నూ ప్రకటించే అవకాశం ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'భీమ్లా నాయక్​' తొలి సాంగ్​

మలయాళ సూపర్​హిట్​ చిత్రం 'అయ్యప్పనుమ్​ కోషియుమ్​' రీమేక్​లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌-రానా దగ్గుబాటి(Rana Daggubati) ప్రధానపాత్రలో నటిస్తున్నారు. భీమ్లా నాయక్​(Bheemla Nayak) పాత్రలో పవన్​.. డానియల్​ శేఖర్​గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్​ పాత్రకు సంబంధించిన గ్లింప్స్​ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. పవన్​ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని తొలి సాంగ్​ను(Bheemla Nayak Song) విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్​ఎస్​ తమన్​ స్వరాలను సమకూరుస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. భీమ్లా నాయక్​ మాస్​లుక్​ అదరహో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.