ETV Bharat / sitara

'టక్ జగదీష్' కొత్త అప్​డేట్.. ఇష్టమైన దర్శకుడితో తమన్నా

author img

By

Published : Mar 18, 2021, 5:46 PM IST

Tuck jagadish, Suriya 40, Bumper offer 2, Ek mini katha, Shashi movie updates
'టక్ జగదీష్' కొత్త అప్​డేట్.. ఇష్టమైన దర్శకుడితో తమన్నా

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో టక్ జగదీష్, #సూర్య40, బంపర్ ఆఫర్ 2, ఏక్ మినీ కథ, శశి, పచ్చీస్ చిత్రాల సంగతులు ఉన్నాయి.

*నాని 'టక్ జగదీష్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ మేరకు ఓ ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నారు. ఏప్రిల్ 23న చిత్రం థియేటర్లలోకి తీసుకురానున్నారు.

nani tuck jagadish movie
టక్ జగదీష్ సెట్​లో నాని

*'హ్యాపీడేస్' దర్శకుడు శేఖర్​ కమ్ములను చాలారోజుల తర్వాత హీరోయిన్ తమన్నా కలిసింది. అందుకు సంబంధించన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

tamannah sekhar kammula
దర్శకుడు శేఖర్ కమ్ములతో తమన్నా

*సూర్య కొత్త సినిమా షూటింగ్​లో భాగంగా తిరిగి సెట్​లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

suriya 40th movie
కొత్త సినిమా సెట్​లో సూర్య

*'బంపర్ ఆఫర్ 2' లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి శ్రీకాంత్ హాజరయ్యారు. సాయిరామ్ శంకర్ హీరోగా నటించడం సహా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Bumper offer 2 movie opening
బంపర్ ఆఫర్ 2 సినిమా ప్రారంభోత్సవం

*'ఏక్ మినీ కథ' నుంచి 'ఈ మాయలో' సాంగ్ రిలీజైంది. దీంతో పాటు 'పచ్చీస్' టీజర్, 'శశి' సినిమాలోని 'ఒకే ఒక లోకం నువ్వే' వీడియో గీతాలు కూడా విడుదలయ్యాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.