ETV Bharat / sitara

సూర్య కొత్త సినిమా థియేటర్లలో.. 'డాన్' ఫస్ట్​లుక్

author img

By

Published : Nov 10, 2021, 6:00 PM IST

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శెభాష్ మిథు, గణ్​పథ్, ఛలో ప్రేమిద్దాం, డాన్, సూర్య కొత్త సినిమా సంగతులు ఉన్నాయి.

suriya new movie
సూర్య- శివకార్తికేయన్

*సూర్య కొత్త సినిమా 'ఎతరుక్కుమ్ తునిందవన్' షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్​ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సూర్య గత చిత్రాలు 'ఆకాశం నీ హద్దురా!', 'జై భీమ్'.. ఓటీటీలో విడుదలై నెటిజన్ల నుంచి విశేషాదరణ దక్కించుకున్నాయి. వాటిని థియేటర్​లో చూడలేకపోయామే అని బాధపడుతున్న ఆయన అభిమానులు.. ఇప్పుడు కొత్త సినిమాతో ఖుషీ కానున్నారు. సన్​పిక్చర్స్ నిర్మించగా, పాండిరాజ్ దర్శకత్వం వహించారు.

suriya new movie
సూర్య కొత్త సినిమా

*టీమ్​ఇండియా మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ 'శెభాష్ మిథు'. తాప్సీ టైటిల్​ రోల్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. త్వరలో అప్డేట్స్ ఇవ్వడం సహా రిలీజ్ డేట్​ను ప్రకటించే అవకాశముంది.

mithaliraj biopic
శెభాష్ మిథు మూవీ టీమ్

*యాక్షన్ మూవీ 'గణ్​పథ్' షూటింగ్​లో హీరోయిన్ కృతిసనన్ పాల్గొంది. ఈ విషయాన్ని హీరో టైగర్​ష్రాప్ ట్వీట్ చేశారు. ఇందులో తాను బైక్ రైడ్, స్టంట్స్ చేయనున్నట్లు కృతి చెప్పింది.

*శివకార్తికేయన్ 'డాన్' సినిమా ఫస్ట్​లుక్ రిలీజైంది. ఇటీవల 'వరుణ్ డాక్టర్' సినిమాతో అలరించిన ఇతడు.. ఇప్పుడు కాలేజ్ బ్యాక్​డ్రాప్​తో తీసిన ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'డాన్'క్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహించారు. అనిరుధ్ సంగీతమందించారు.

DON movie first look
'డాన్' మూవీ ఫస్ట్​లుక్

*సాయి రోనక్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం 'ఛలో ప్రేమిద్దాం'. సురేశ్ శేఖర్ దర్శకత్వం వహించిన సినిమా టీజర్​ను బుధవారం రిలీజ్ చేశారు. ఉదయ్ కిరణ్ నిర్మించిన ఈ చిత్రంతో హీరోహీరోయిన్ల మధ్య జరిగే ప్రేమ, సంఘర్షణ తదితర అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.