ETV Bharat / sitara

రాజమౌళితో ప్రాజెక్ట్‌పై సూపర్‌స్టార్‌ ఏమన్నారంటే..?

author img

By

Published : Aug 9, 2021, 7:09 PM IST

స్టార్ దర్శకుడు రాజమౌళి- సూపర్​స్టార్ మహేశ్​బాబు కాంబినేషన్​లో చిత్రం కోసం అటు అభిమానులే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్​పై మహేశ్​బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో మీరూ చదివేయండి..

superstar maheshbabu
సూపర్‌స్టార్‌ మహేశ్​బాబు

దర్శకధీరుడు రాజమౌళి- సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం మనందరికీ తెలుసు. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమా రానుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జక్కన్నతో కలిసి పనిచేయడం గురించి మహేశ్‌ స్పందించారు.

'మా ఇద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్ట్‌ వస్తే చూడాలని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మా సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఇప్పుడే దాని గురించి ఏం బయటపెట్టలేను. ఈ సినిమా నాకెంతో స్పెషల్‌. ఇది మరో బాహుబలి మాత్రం కాదు' అని ఆయన అన్నారు.

సంక్రాంతి కానుకగా..

'సర్కారు వారి పాట' రిలీజ్‌ గురించి ఆయన స్పందిస్తూ.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న థియేటర్లలోనే విడుదల చేయనున్నాం. ఆ విషయంలో నేనెంతో నమ్మకంగా ఉన్నాను. ఓటీటీ మీద నాకు గౌరవం ఉంది. అది వేరే తరహా మాధ్యమం. వెండితెర కోసమే నా సినిమాలు సిద్ధమవుతున్నాయి. అలాగే, థియేటర్ల వేదికగా నా ఫ్యాన్స్‌ని నేను కలవగలను' అని మహేశ్‌ వివరించారు.

ఎక్కువ సమయం వారితోనే ..

కరోనా వల్ల వచ్చిన బ్రేక్‌తో తన తండ్రి, భార్యాపిల్లలతో ఎక్కువగా సమయం గడపడానికి అవకాశం లభించిందని ఆయన తెలిపారు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌ తిరిగి ప్రారంభమవుతున్నాయని.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సెట్‌లోకి అడుగుపెడుతున్నామని వివరించారు. కరోనా వేళ అధికారుల సూచనలు తప్పకుండా అందరూ పాటించాలని మహేశ్‌ కోరారు.

త్రివిక్రమ్​ దర్శకత్వంలో..

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్‌ సర్కారువారి పాట సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేశ్‌ యంగ్‌ లుక్‌లో మరింత ఎనర్జిటిక్‌గా కనిపించనున్నారు.

ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ సినిమా పట్టాలెక్కించనున్నారు. అనంతరం రాజమౌళితో భారీ ప్రాజెక్ట్‌ చేయనున్నారు.

ఇవీ చదవండి:

మహేష్​- త్రివిక్రమ్‌ మూవీ.. అప్డేట్​ వచ్చేసింది..

'సర్కారు వారి పాట' బ్లాస్టర్.. మహేశ్ లుక్స్ అదుర్స్

ఆరడుగుల అందగాడు.. అమ్మాయిల రాకుమారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.