ETV Bharat / sitara

మహేశ్​ సినిమాకు అదిరిపోయే టైటిల్!

author img

By

Published : May 27, 2020, 3:40 PM IST

సూపర్ స్టార్ మహేశ్​-పరశురామ్​ కాంబినేషన్​లో రూపొందబోయే చిత్రానికి విభిన్నమైన టైటిల్​ పెట్టే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఓ టైటిల్ మాత్రం నెట్టింట సందడి చేస్తోంది.

మహేశ్​ సినిమాకు అదిరిపోయే టైటిల్
మహేశ్​బాబు

సూపర్​స్టార్ మహేశ్​బాబు కొత్త సినిమాకు అదిరిపోయే టైటిల్ అనుకుంటున్నారు. పరశురామ్​ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'సర్కారు వారి పాట' అనే క్రేజీ పేరు పెట్టాలని భావిస్తున్నారు. ఈనెల 31న ఆయన తండ్రి సూపర్​స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల చక్కదిద్దుకున్న తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

SUPERSTAR MAHESH BABU
సూపర్​స్టార్ మహేశ్​బాబు

లాక్​డౌన్ వల్ల ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న మహేశ్​.. కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో ఆనందంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులతో టచ్​లో ఉంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.