ETV Bharat / sitara

నాన్​స్టాప్​గా 'ఎఫ్​3' షూట్.. మూడో హీరోపై క్లారిటీ!

author img

By

Published : Jan 17, 2021, 8:10 PM IST

'ఎఫ్ 3' సెట్​లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఫన్​కు సెలవులు ఉండవని రాసుకొచ్చారు. ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది సినిమా.

sunil in F3 movie.. director anil ravipudi tweet
నాన్​స్టాప్​గా 'ఎఫ్​3' షూట్.. మూడో హీరోపై క్లారిటీ!

'ఎఫ్3' షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఓ ఫొటోను పంచుకున్నారు. అయితే ఇందులో సునీల్ కనిపించడం వల్ల గత కొన్నాళ్ల నుంచి వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లేనే తెలుస్తోంది.

2019 సంక్రాంతికి విడుదలైన 'ఎఫ్2'కు సీక్వెల్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాతృకలో నటించిన వెంకటేశ్, వరుణ్​తేజ్​తో పాటు ఇందులో మరో హీరో కూడా నటిస్తారనే చిత్రబృందం వెల్లడించింది. దీంతో రవితేజ, సునీల్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు సెట్​లో సునీల్​ ఉండటం వల్లే మూడో కథానాయకుడు అతడేనని తెలిసింది!

ఈ సినిమాను కూడా దిల్​రాజ్ నిర్మిస్తుండగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.