ETV Bharat / sitara

బాలయ్యకు హీరోయిన్​గా శ్రుతిహాసన్!

author img

By

Published : May 17, 2021, 6:04 PM IST

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్​లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్​గా శ్రుతిహాసన్​ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

sruthi haasan team up with balakrishna
బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. చిత్రానికి సంబంధించి దర్శకుడు పనులు మొదలుపెట్టారు. ఇందులో నాయికగా శ్రుతిహాసన్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్‌ దర్శకత్వంలో శ్రుతిహాసన్‌ పలు సినిమాలు చేసింది. ఈ ఏడాది విడుదలైన 'క్రాక్‌'లోనూ హీరోయిన్​గా అలరించింది. బాలయ్య సినిమా కోసం గోపీచంద్‌ - శ్రుతిహాసన్‌ని సంప్రదించారని, అందుకు ఆమె వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందని చెప్పుకొంటున్నారు.

sruthi hasan
శ్రుతిహాసన్

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' చేస్తున్నారు. ఈ సినిమాను దసరా నాటికి తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అప్పుడే కొత్త చిత్రాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రుతిహాసన్‌.. ప్రభాస్‌ 'సలార్‌'లో నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.