ETV Bharat / sitara

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రామ్.. ఎందుకంటే?

author img

By

Published : Feb 6, 2021, 12:21 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దైవభక్తిలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఆయన శివుని మాల ధరించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు.

Ram Pothineni
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రామ్

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని ఇటీవలే 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం విబిన్న కాన్సెప్ట్​తో ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ హీరో నెటిజన్లకు ఓ షాక్ ఇచ్చారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.

రామ్.. శివుని మాలను ధరించి ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టు చేస్తూ.. "ఓం నమఃశివాయ, చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. మళ్లీ వస్తా" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. కానీ మాల తర్వాత మళ్లీ షూటింగ్​లు మొదలు పెడతారని అంతా భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ హీరో నుంచి కొత్త సినిమా ప్రకటనలు ఏవీ లేవు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.