ETV Bharat / sitara

సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్​లుక్ డేట్ ఫిక్స్.. డాన్​గా కార్తికేయన్

author img

By

Published : Jan 27, 2021, 11:56 AM IST

Updated : Jan 27, 2021, 12:50 PM IST

డైలాగ్ కింగ్ మోహన్​బాబు కీలకపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. ఈ సినిమా ఫస్ట్​లుక్ విడుదల తేదీపై స్పష్టతనిచ్చింది చిత్రబృందం. అలాగే కోలీవుడ్ నటుడు శివ కార్తికేయక్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

Shiva Karthikeyan new movie announced, Son Of India first release date revealed
సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్​లుక్ డేట్ ఫిక్స్.. డాన్​గా శివ

కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం. లైకా ప్రొడక్షన్స్, శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్​ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి 'డాన్' అనే టైటిల్ ఖరారు చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

డైలాగ్​ కింగ్​ మోహన్‌బాబు కథానాయకుడిగా.. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం 'సన్‌ ఆఫ్‌ ఇండియా'. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. విష్ణు మంచు నిర్మాత. తాజాగా సినిమా ఫస్ట్​లుక్​ను జనవరి 29న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం.

Last Updated : Jan 27, 2021, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.