ETV Bharat / sitara

కొత్త దర్శకుడికి సమంత గ్రీన్​సిగ్నల్​!

author img

By

Published : Sep 17, 2021, 3:25 PM IST

స్టార్​ హీరోయిన్​ సమంత(samantha movie list 2021) ఓ కొత్త దర్శకుడికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

samantha
సమంత

స్టార్​ హీరోయిన్​ సమంత(samantha movie list 2021) విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ కెరీర్​లో దూసుకెళ్తోంది. ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్‌'తో(samantha family man look) హిందీ ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్​ కథలను వినడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందని ప్రచారం సాగింది! ఇకపై​ తెలుగులో సామ్​ నటించదని అంతా మాట్లాడుకున్నారు.

కానీ ఇప్పుడు తెలుగులోనే ఓ కొత్త దర్శకుడికి సామ్​ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కథ వినగానే ఎంతో ఆసక్తిగా అనిపించి ఓకే చెప్పిందని సమాచారం. నవంబరు నుంచి కాల్​ షీట్లను ఇచ్చిందని తెలిసింది. త్వరలోనే చిత్ర టైటిల్​ సహా మిగతా నటీనటుల వివరాలతో ఈ మూవీ గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. శ్రీదేవీ మూవీస్​ బ్యానర్​లో ఈ సినిమా రూపొందనుందట. ఈ బ్యానర్​లో 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు', నాని 'జెంటిల్​మెన్'​, సుధీర్​బాబు 'సమ్మోహనం' వంటి హిట్​ చిత్రాలు రూపొందాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

త్వరలోనే సమంత.. గుణశేఖర్​ దర్శకత్వంలో 'శాకుంతలం'(samantha shakuntalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: Samantha: ఆ పేరు తొలగింపుపై సమంత స్పందన ఏంటంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.