ETV Bharat / sitara

సమంత రికార్డు.. దక్షిణాదిలోనే తొలి నటిగా

author img

By

Published : Jan 23, 2021, 5:30 AM IST

తన ఫొటోతో ట్విట్టర్​ ఏమోజీ పొందిన సమంత.. ఈ ఘనత సాధించిన దక్షిణాది తొలి నటిగా నిలిచింది. అంతకు ముందు పలువురు హీరోలు మాత్రమే ఈ రికార్డు సాధించారు.

samantha to be first Actress from South movie industry to be part of a Twitter emoji
సమంత రికార్డు.. దక్షిణాదిలోనే తొలి నటిగా

ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సమంత అక్కినేని.. అరుదైన రికార్డు సృష్టించింది. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్​తో వెబ్ ఎంట్రీ ఇచ్చిన సామ్.. ట్విట్టర్​ ఏమోజీ దక్కించుకున్న దక్షిణాది తొలి నటిగా నిలిచింది. అంతకు ముందు హీరోల్లో విజయ్, రజినీకాంత్ తదితరులకు ట్విట్టర్​ ఏమోజీలు వచ్చాయి.

samantha Twitter emoji
సమంత ఏమోజీ
samantha Twitter emoji
సమంత ఏమోజీ

ఈ ఏమోజీల్లో సమంత ఆర్మీ దుస్తుల్లో కనిపిస్తోంది. దీంతో అభిమానుల మదిలో రకరకాల సందేహాలు వస్తున్నాయి. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' ఉగ్రవాది పాత్రలో సమంత నటించిందంటూ తొలుత వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏమోజీల్లో వేరే ఫొటో ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అమెజాన్ ప్రైమ్​లో వచ్చే నెల 12 నుంచి ఈ సిరీస్​ స్ట్రీమింగ్ కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.