ETV Bharat / sitara

ప్రభాస్​- నాగ్​ అశ్విన్​ సినిమాలో మరో ఇద్దరు స్టార్స్​!

author img

By

Published : Jul 29, 2021, 1:15 PM IST

నాగ్​ అశ్విన్​.. ప్రభాస్​, అమితాబ్​ బచ్చన్​, దీపికా పదుకొణెతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సైన్స్​ఫిక్షన్​ సినిమా షూటింగ్​ ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రంలో మరో ఇద్దరు స్టార్​ నటులను తీసుకోవాలని అశ్విన్​ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇంతకీ వారెవరంటే?

prabhas
ప్రభాస్​ నాగ్​ అశ్విన్​

సమంత.. టాలీవుడ్​లో ప్రభాస్​ మినహా దాదాపు అందరు స్టార్​ హీరోలతో నటించింది. డార్లింగ్​తో మాత్రం ఇప్పటివరకు చేయలేదు. అయితే ఇప్పుడది నిజమయ్యేలా కనిపిస్తుంది!

నాగ్​అశ్విన్​.. ప్రభాస్​ హీరోగా సైన్స్​ ఫిక్షన్​ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్​ ప్రారంభమైంది. అంతకుముందు ఆయన దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన 'మహానటి' సినిమాలో కీర్తిసురేశ్​తో పాటు​ సమంత, విజయ్​ దేవరకొండ, దుల్కర్​ సల్మాన్​ లాంటి స్టార్లు నటించారు.

ఇప్పుడదే సెంటిమెంట్​ను కొనసాగిస్తూ తన సైన్స్​ ఫిక్షన్​ సినిమాలోనూ ప్రముఖ నటులను ఎంపిక చేసుకుంటున్నారు అశ్విన్​. ఇప్పటికే బిగ్​బీ, దీపికా పదుకొణెను తీసుకోగా ఇప్పుడు మరో రెండు ప్రధాన పాత్రల కోసం దక్షిణాది స్టార్స్​ సమంత,​ పృథ్వీరాజ్​ను​ తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సామ్​తో చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్​ సినిమాలో సామ్​ నటించినట్లవుతుంది. మరి ఈ బడా నటులను ఎంపిక చేసుకునే సెంటిమెంట్​.. అశ్విన్​ కొత్త సినిమా విజయానికి దోహదపడుతుందో లేదో చూడాలి.

ఇదీ చూడండి: ప్రభాస్ ప్రతిష్ఠాత్మక సినిమా ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.