ETV Bharat / sitara

సల్మాన్​ఖాన్​పై వెబ్ సిరీస్.. బాలీవుడ్​ మొత్తం ఇందులోనే

author img

By

Published : Oct 28, 2021, 10:52 AM IST

కండలవీరుడు సల్మాన్​ఖాన్(salman khan web series) లైఫ్​స్టోరీతో ఓ డాక్యుమెంటరీ తీస్తున్నారు. దీనికి ఆలియా(alia bhatt salman khan).. యాంకర్​గా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నారు.

Salman Khan Documentary
సల్మాన్​ఖాన్​

స్టార్ హీరో సల్మాన్​ఖాన్​ జీవితం ఆధారంగా 'బియాండ్ ద స్టార్: సల్మాన్​ఖాన్'(salman khan documentary) అనే డాక్యుమెంటరీ సిరీస్​ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్​ నటీనటులు అందరూ దాదాపుగా ఇందులో కనిపించనున్నారు. హీరోయిన్ ఆలియా భట్(alia bhatt first movie).. ఈ సిరీస్​కు యాంకర్​గా వ్యవహరించనుంది. స్టార్ డైరెక్టర్​ సంజయ్ లీలా భన్సాలీ(sanjay leela bhansali upcoming movies) కూడా ఇందులో భాగం కావడం విశేషం.

భన్సాలీ.. సల్మాన్, ఆలియాతో 'ఇన్-షా అల్లా' సినిమా తీయాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ సిరీస్​తో జోడీని కుదిర్చారు.

alia bhatt
ఆలియా భట్

"సూపర్​స్టార్ స్టార్​డమ్​ కాకుండా ఎవరికీ తెలియని సల్మాన్​ ప్రపంచాన్ని ఈ సిరీస్​లో చూపించనున్నారు. సల్మాన్​ కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలోని స్నేహితులు సాజిద్ నడియావాలా, డేవిడ్ ధావన్, అనీష్ భజ్మీ, జాకీష్రాఫ్, సంజయ్​దత్ చెప్పిన విశేషాలను ఇప్పటికే రికార్డు కూడా చేశారు" అని సల్మాన్(salman khan documentary)​ సన్నిహితుడు చెప్పారు.

అయితే ఇది తొలి సీజన్​ మాత్రమే అని, దీనిని ఫ్రాంఛైజీగానూ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో ప్రముఖ ఓటీటీలో(ott full form) దీనిని విడుదల చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.