ETV Bharat / sitara

RRR movie: రాబోయే మూడు వారాలు రచ్చ రచ్చే!

author img

By

Published : Dec 17, 2021, 10:11 PM IST

Updated : Dec 18, 2021, 9:38 AM IST

RRR MOVIE
ఆర్ఆర్ఆర్ మూవీ

రానున్న కొన్ని వారాలు పూర్తిగా ప్రచారంలో బిజీగా మారిపోతామని 'ఆర్ఆర్ఆర్' టీమ్ చెప్పింది. ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ముంబయిలోనూ ప్రచారం చేసిన 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్.. 'పుష్ప' రిలీజ్​ సందర్భంగా దానికి కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రమోషన్​ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతుంది.

రాబోయే మూడు వారాలు కూడా ఫుల్ క్రేజీ, ఫన్ ఉండబోతుందని 'ఆర్ఆర్ఆర్' టీమ్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సినిమాను ప్రచారం చేయడం సహా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చాలా ఉంటాయని చెప్పారు. అన్నింటికీ అభిమానులు గెట్​ రెడీ కావాలని ట్వీట్ చేశారు.

RRR movie team tweet
ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ట్వీట్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated :Dec 18, 2021, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.