ETV Bharat / sitara

పాన్​ఇండియాగా ప్రాంతీయ సినిమా.. ఆ ఇద్దరి వల్లే: ఎన్టీఆర్

author img

By

Published : Feb 7, 2022, 10:37 PM IST

NTR
ఎన్టీఆర్

NTR: ప్రాంతీయ సినిమా హద్దులను చెరిపేసి, భారతీయ సినిమాగా మార్చిన ఘనత ఇద్దరికే దక్కుతుందని అన్నారు యంగ్​టైగర్​ ఎన్టీఆర్. వారిని చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు.

NTR: ప్రాంతీయ సినిమాను పాన్​ఇండియాగా మలిచిన ఘనత.. దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్​కే దక్కుతుందన్నారు యంగ్​టైగర్​ ఎన్టీఆర్. గతేడాది ముంబయిలో జరిగిన 'రోర్​ ఆఫ్​ ఆర్​ఆర్​ఆర్'​ ఈవెంట్​లో ఈమేరకు వ్యాఖ్యానించారు.

NTR
కరణ్, చెర్రీ, అలియాతో ఎన్టీఆర్

"చరిత్రలో మనం పేజీలు తిరగేస్తే.. ప్రాంతీయ సినిమా హద్దులను చెరిపేసి.. ఇండియన్​ సినిమాగా మార్చిన ఘనత రాజమౌళి, కరణ్ జోహార్​కే దక్కుతుంది. చరిత్రలో మిమ్మల్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒక్కో చేత్తో ఎప్పుడూ చప్పట్లు కొట్టలేము. ఈ హద్దులను చెరిపేసినందుకు ధన్యవాదాలు. మేము ఇంత నమ్మకంగా ఈ వేదికపై నిలబడ్డామంటే మీ (కరణ్) వల్లే"

-ఎన్టీఆర్, నటుడు

ఇక రామ్​చరణ్​తో ఒకే వేదికపై ఉండటం ఎంతో ప్రత్యేకమని తారక్ చెప్పారు. అతడి గురించి మాటల్లో చెప్పడం కష్టమని అన్నారు. ఒక సోదరుడిలా, గైడ్​లా ఉన్న ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

NTR
చెర్రీ-తారక్

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన 'ఆర్​ఆర్​ఆర్​'లో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాత. మార్చి 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి:

తెలుగు హీరోల ప్రాణమంతా 'పాన్ ఇండియా'

RRR censor review: 'మైండ్​ బ్లోయింగ్​.. ఎన్టీఆర్​ నటన టాక్​ ఆఫ్​ ది టౌన్​'

టాలీవుడ్‌ బాలీవుడ్‌ కాదు.. ఇండీవుడ్‌..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.