ETV Bharat / sitara

అతిపెద్ద స్క్రీన్​పై 'ఆర్​ఆర్​ఆర్'.. వినూత్న​ ఐడియాతో 'రాధేశ్యామ్'​!

author img

By

Published : Mar 2, 2022, 1:26 PM IST

RRR movie
ఆర్​ఆర్​ఆర్​

RRR Radheshyam update: 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా ఓ అరుదైన ఘనత సాధించనుంది. యూకేలోని అతిపెద్ద స్క్రీన్​పై ప్రదర్శనకానున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కనుంది. కాగా, ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ ప్రమోషన్స్​లో భాగంగా దేశవ్యాప్తంగా ఆస్ట్రాలజీ కౌంటర్లను ఏర్పాటు చేసింది చిత్రబృందం.

RRR in UK Big Screen: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా మరో అరుదైన ఘనతను సాధించనుంది! లండన్​లో ఒడియన్​ బీఎఫ్​ఐ ఐమాక్స్​లో ఈ మూవీ ప్రదర్శనకానుంది. యూకేలోనే ఇది అతి పెద్ద ఐమ్యాక్స్​ థియేటర్​ అవ్వడం విశేషం. కాగా, ఈ తెరపై ప్రదర్శనకానున్న తొలి భారతీయ చిత్రం ఇదే. యూకేలో దాదాపు 1000 స్క్రీన్లపై 'ఆర్​​ఆర్​ఆర్​'​ రిలీజ్​ కానున్నట్లు తెలిసింది. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది. దాదాపు రూ.450కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ మూవీలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్​ దేవగణ్​, ఆలియా భట్​, శ్రియ కీలక పాత్రలో నటించారు.

మరోవైపు ఈ చిత్ర ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను దుబాయ్​లో గ్రాండ్​గా నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్​ యాక్షన్​ హీరో టామ్​ క్రూజ్​​ను ముఖ్య అతిథిగా పిలవాలని భావిస్తోందట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆస్ట్రాలజీ కౌంటర్​

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​ను వేగవంతం చేసిన చిత్రబృందం... ఇప్పుడు వినూత్నంగా చేయడం ప్రారంభించింది. జోతిష్యం, హస్తసాముద్రికం నేపథ్యంలో వస్తున్న సినిమా అవ్వడం వల్ల దేశవ్యాప్తంగా పలు సెంటర్​లలో ఆస్ట్రాలజీ కౌంటర్​లను ఏర్పాటు చేసింది. అక్కడ జోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్స్​ చేస్తున్నారు. ఈ వినూత్న ప్లాన్​కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్​ ఇచ్చారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రిలీజ్​ డేట్స్​తో షారుక్​, వరుణ్​.. ఆ హీరోకు 'ఆర్​ఆర్​ఆర్'​ టీమ్​ థ్యాంక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.