ETV Bharat / sitara

పవర్​స్టార్​ హీరోగా 'రిపబ్లిక్' సీక్వెల్!

author img

By

Published : Dec 21, 2021, 8:37 PM IST

Pawan kalyan Republic Movie: పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ కథానాయకుడిగా 'రిపబ్లిక్​'​ సినిమా సీక్వెల్​ తీయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు దర్శకుడు దేవకట్టా. త్వరలోనే దీనిపై స్పష్టతనిస్తానని చెప్పారు.

పవర్​స్టార్​ హీరోగా రిపబ్లిక్, Repblic movie sequel with Pawankalyan
పవర్​స్టార్​ హీరోగా రిపబ్లిక్ సీక్వెల్

Pawan kalyan Republic Movie: ప్రజాస్వామ్యదేశంలో నిజాయితీగా పనిచేసే అభిరామ్ అనే ఓ ఐఏఎస్ అధికారి కథతో ప్రముఖ దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం 'రిపబ్లిక్'. సాయి ధరమ్ తేజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్ లోనే కాకుండా ఓటీటీలోనూ విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగాన్ని పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కించాలని దర్శకుడు దేవకట్టా ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.

రాజకీయ, పోలీసు, న్యాయ వ్యవస్థలో ఏదో ఒక అంశంపై రిపబ్లిక్ రెండో భాగం ఉంటుందని దేవకట్టా స్పష్టం చేశారు. రిపబ్లిక్​తో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటం వల్ల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్​లో జీ5 ఓటీటీ సంస్థ విజయోత్సవ వేడుకలకు నిర్వహించింది. దర్శకుడు దేవకట్టాతోపాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నిర్మాత నిహారిక హాజరై కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచున్నారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ రెండో భాగంపై స్పష్టత ఇచ్చారు దేవకట్టా. మరో రెండు నెలల్లో రిపబ్లిక్ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Republic movie review: 'రిపబ్లిక్' మూవీ రివ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.